Share News

Tungabhadra: తుంగభద్రకు ఇన్‌ఫ్లో తగ్గింది..

ABN , Publish Date - Jul 02 , 2025 | 01:17 PM

తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో(Inflow) తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా ఎగువ నుంచి వరద తాకిడి తగ్గింది. దీంతో ఇప్పుడే క్రస్ట్‌గేట్లు ఎత్తే ఆలోచన లేనట్లు బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Tungabhadra: తుంగభద్రకు ఇన్‌ఫ్లో తగ్గింది..

- నీటి విడుదలలో మరింత జాప్యం

బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి ఇన్‌ఫ్లో(Inflow) తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా ఎగువ నుంచి వరద తాకిడి తగ్గింది. దీంతో ఇప్పుడే క్రస్ట్‌గేట్లు ఎత్తే ఆలోచన లేనట్లు బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండు, మూడు రోజుల్లో నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు. రెండు రోజులుగా జలాశయంలోకి ఇన్‌ఫ్లో 60,000 క్యూసెక్కులకు పైగా ఉంది.


pandu2.jpg

మంగళవారం సగటు ప్రవాహం 33.916 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుత నీటి మట్టం 1.624.38 అడుగులు , జలాశయం నిల్వ సామర్థ్యం 74.48 టీఎంసీలు. జూలై, ఆగస్టు నెలల్లో సాధారణంగా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈసారి గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయకూడదని నిర్ణయించినందున, వీలయినంత త్వరగానే క్రస్ట్‌ గేట్లు ఎత్తి అదనపునీటిని నదిలోకి విడుదల చేసే అవకాశం ఉంది.


zz.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

విద్యార్థుల హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలి

అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 02 , 2025 | 01:18 PM