Share News

Cyber Crime: ఎంపీ ఖాతాలోంచి రూ.56 లక్షలు దోచేశారు

ABN , Publish Date - Nov 07 , 2025 | 08:13 PM

కల్యాణ్ బెనర్జీ అసాంసోల్ (దక్షిణ్) ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2001-2006 మధ్య ఎస్‌బీఐలో ఖాతా తెరిచారు. అయితే చాలా ఏళ్లుగా ఈ అకౌంట్ యాక్టివ్‌గా లేదు. 2025 అక్టోబర్ 28న సైబర్ మోసగాళ్లు ఆయన అకౌంట్‌కు అనుసంధానించిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను మార్చారు.

Cyber Crime: ఎంపీ ఖాతాలోంచి రూ.56 లక్షలు దోచేశారు
Kalyan Banerjee

న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజానీకాన్నే కాకుండా ఎంపీలను కూడా బెంబేలెత్తిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) తాజాగా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. నకిలీ కేవైసీతో ఆయన ఎస్‌బిఐ ఖాతాలోంచి రూ.56 లక్షలు కాజేశారు.


అధికార వర్గాల సమాచారం ప్రకారం, కోల్‌కాతాలోని తమ బ్రాంచ్‌లో కల్యాణ్ బెనర్జీ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు దోచేసినట్టు సైబర్ క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌కు ఎస్‌బీఐ ఫిర్యాదు చేసింది. తప్పుడు లావాదేవాలపై తక్షణ విచారణ జరపాలని కోరింది. బ్యాంకు ఖాతా కేవైసీని అప్‌డేట్ చేయడానికి నకిలీ పాన్, ఆధార్ కార్డు, మార్ఫింగ్ చేసి ఎంపీ ఫోటోను మోసగాళ్లు ఉపయోగించారు.


కల్యాణ్ బెనర్జీ అసాంసోల్ (దక్షిణ్) ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2001-2006 మధ్య ఎస్‌బిఐలో ఖాతా తెరిచారు. అయితే చాలా ఏళ్లుగా ఈ అకౌంట్ యాక్టివ్‌గా లేదు. 2025 అక్టోబర్ 28న సైబర్ మోసగాళ్లు ఆయన అకౌంట్‌కు అనుసంధానించిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను మార్చారు. కేవైసీ అప్‌డేట్ కాగానే పలుమార్లు ఆన్‌లైన్ లావాదేవీలు జరిపారు. వివిధ లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.56 లక్షలకు పైగా సొమ్మును మళ్లించి బంగారం కొనుగోలు చేశారు. కొంత సొమ్మును ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకున్నారు. యాక్టివ్‌గా లేని అకౌంట్‌లో లావాదేవీలు జరగడాన్ని ఇటీవల గుర్తించిన ఎంపీ ఆ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.


కాగా, తమకు అందిన ఫిర్యాదుపై వెంటనే దర్యాప్తు చేపట్టినట్టు సైబర్ క్రైమ్ అధికారి ఒకరు తెలిపారు. ఇన్వెస్టిగేటర్లకు అన్ని విధాలా సహకరిస్తామని, నిందితులను పట్టుకునేందుకు వీలుగా కేవైసీ రికార్డులు, ట్రాన్సాక్షన్ లాగ్స్, ఇంటర్నల్ ఆడిట్ వివరాలను అందిస్తామని, బ్యాంకులో విధానపరమైన లోపాలు ఉన్నయా అనేది గుర్తిస్తామని ఎస్‌బీఐ ఉన్నతాధికారులు తెలిపారు.


ఎంపీ స్పందన

సైబర్ నేరగాళ్ల చర్చపై ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. 'బ్యాంకుల్లో సొమ్ములు దాచుకుంటే నేరగాళ్లు పట్టుకుపోతున్నారు. ఇంట్లో పెట్టుకుంటే నరేంద్ర మోదీ తీసుకుపోతున్నారు' అని వ్యాఖ్యానించారు. కాగా, అధికారులు సైబర్ నేరగాళ్లను పట్టుకుని సొమ్ము రికవరీ చేస్తారనే ఆశాభావంతో ఎంపీ ఉన్నట్టు ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

రహస్య అణు పరీక్షలు పాక్‌కు కొత్తకాదు... స్పందించిన భారత్

అది మీ కుమారుడి తప్పిదం కాదు.. ఎయిరిండియా దుర్ఘటనపై సుప్రీంకోర్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 07 , 2025 | 08:19 PM