Home » TMC
మదన్ మిత్రా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురికావడంతో టీఎంసీ దీనిపై సామాజిక మాధ్యమంలో స్పందించింది. వ్యక్తిగత హోదాలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు పార్టీ అభిపాయం కాదని వివరణ ఇచ్చింది. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.
లా విద్యార్థిని అత్యాచార ఘటనపై కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన మహువా మెయిత్రా.. ఆయనొక 'స్త్రీ ద్వేషి' అంటూ ఘాటుగా విరుచుకుపడ్డారు. దీనిపై కల్యాణ బెనర్జీ కన్నెర్ర చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో (Kolkata Gang Rape Case) పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇదే సమయంలో ఈ విషయంపై టీఎంసీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఉప ఎన్నికల్లో టీఎంసీ 55 శాతం ఓటింగ్ షేర్ పొందగా, బీజేపీ 28 శాతం, కాంగ్రెస్ 15 శాతం ఓటింగ్ షేర్ పొందాయి. కలీగంజ్ సీటు తిరిగి గెలుచుకుంటామని టీఎంసీ మొదట్నించీ ధీమాతో ఉండగా, ఈ నియోజకవర్గంలో 48 శాతం మైనారిటీ ఓట్లు ఉండటంతో బీజేపీ ప్రధానంగా హిందూ ఓట్లుపైనే ఫోకస్ చేసింది.
బీజేడీ మాజీ ఎంపీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా వివాహం చేసుకున్నారు. మంగళవారం విదేశాల్లో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా వెల్లడించింది.
పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఊచకోత కోసిన ఉగ్రదాడిని అభిషేక్ బెనర్జీ ప్రస్తావిస్తూ, దీని వెనుక ఉన్న రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) అనేది ఉందని, అది పాక్ ఉగ్రవాద లష్కరే తొయిబా సంస్థకు చెందనిదని, ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ డెలిగేషన్ కోసం ఒక పేరును సూచించాలని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరడంతో అభిషేక్‌ను పార్టీ తరఫున సీఎం నామినేట్ చేశారు.
హింసాకాండ చెలరేగిన ముర్షీదాబాద్ జిల్లాలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. జాంగిపూర్, ముర్షీదాబాద్, బహ్రాంపూర్. మూడు నియోజకవర్గాలకు టీఎంసీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాంగిపూర్‌కు ఖలీలుర్ రెహమాన్, ముర్షీదాబాద్‌కు తహెర్ ఖాన్, బహ్రాంపూర్‌కు యూసఫ్ పఠాన్ ఎంపీలుగా ఉన్నారు.
ఫ్లోర్ టైమ్ బాధ్యత కలిగిన కల్యాణ్ బెనర్జీ లోక్‌సభలో తనకు మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించడం లేదని మెుయిత్రా అసంతృప్తితో ఉన్నారు. పలు అంశాలపై మాట్లాడేందుకు మెుయిత్రా ముందుకు వచ్చినా కల్యాణ్ నిరాకరించినట్టు చెబుతున్నారు.
గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తుపెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ఆప్ మొదట్లోనే ప్రకటించింది.