PM released Stamp & Coin: వందేమాతర 150వ వార్షికోత్సవం.. ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:41 PM
జాతీయ గేయం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక పోస్టల్ స్టాంపు, నాణేలను విడుదల చేశారు. మన వర్తమానంలో కొత్త స్ఫూర్తిని రగిలించే 'వందేమాతరం' గేయం భారతీయ పౌరుల్లో చిరకాలం గుర్తుండేందుకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా నిర్వహించాలని మోదీ సూచించారు..
వందేమాతరం గేయం 150వ(Vande Mataram) వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ప్రత్యేక నాణెం, స్మారక తపాలాబిళ్ల(Commemorative Stamp)ను విడుదల చేశారు. దీంతోపాటు జాతీయ గేయానికి సంబంధించి '150.ఇన్(150.in)' అనే ఓ స్పెషల్ పోర్టల్‌నూ ఆయన ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం(Indira Gandhi Indoor Stadium)లో నిర్వహించిన వందేమాతరం సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. 'వందేమాతరం' అనే పదం మన వర్తమానంలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తిస్తుందని, తద్వారా మనం సాధించలేని లక్ష్యమంటూ ఏదీలేదనే ధైర్యాన్నిస్తుందని చెప్పారు. ఫలితంగా కోట్లాది మంది భారతీయుల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందని ఉద్ఘాటించారు. మోదీకి మద్దతుగా సమాజంలోని అన్నివర్గాల పౌరులు బహిరంగ ప్రదేశాల్లో సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు.
ఈ వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా అనగా 2026 నవంబర్ 7 వరకూ నిర్వహించాలని మోదీ పిలుపునిచ్చారు. దీనికోసం ఈ ఏడాది అక్టోబర్ 1న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు. దేశపౌరుల్లో ముఖ్యంగా యువతలో విప్లవాత్మక స్ఫూర్తిని రగిలించే ఈ గేయంను ఏడాది పాటు ఓ ప్రత్యేక కార్యక్రమంలా నిర్వహించడం వల్ల భావితరాల హృదయాల్లో చిరకాలం నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా, సీఎం రేఖా గుప్తా తదితరులు పాల్గొన్నారు.
1875 నవంబర్ 7వ తేదీన అక్షయ నవమి శుభ సందర్భంగా.. బంకిం చంద్ర ఛటర్జీ( Bankimchandra Chatterji) రచించిన 'ఆనంద్‌మఠ్(Anandmath)' నవలలోని 'వందేమాతరం' గేయం తొలుత 'బంగదర్శన్' అనే సాహిత్య పత్రికలో ప్రచురితమైంది. భారతదేశ స్వాతంత్య్రోద్యమ సమయంలో ఈ గేయం ఎంతగానో స్ఫూర్తినిచ్చింది.
ఇవి కూడా చదవండి:
Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
TPCC chief Mahesh Kumar Goud: మరో డిప్యూటీ సీఎం