Share News

Pakistan Occupied Kashmir: పీవోకేలో ఏముందీ.. సొంతమైతే భారత్‌కు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..

ABN , Publish Date - May 16 , 2025 | 09:16 AM

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో మరోసారి పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్) గురించి చర్చ నడుస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసి ఇండియా ఆర్మీ సత్తా ఏంటో చూపించింది. పనిలో పనిగా ఏళ్లుగా అపరిష్క్రుతంగా ఉన్న పీవోకేను సొంతం చేసుకోవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. అయితే..

Pakistan Occupied Kashmir: పీవోకేలో ఏముందీ.. సొంతమైతే భారత్‌కు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో మరోసారి పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్) గురించి చర్చ నడుస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసి ఇండియా ఆర్మీ సత్తా ఏంటో చూపించింది. పనిలో పనిగా ఏళ్లుగా అపరిష్క్రుతంగా ఉన్న పీవోకేను సొంతం చేసుకోవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. అయితే ఈ పీవోకేను సొంతం చేసుకుంటే.. భారత్‌కు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..


భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందం చేసుకున్నా.. ఆపరేషన్ సిందూర్‌ ఇంకా ముగియలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడ్డా దీటుగా బదులివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పీవోకేను (POK) తిరిగి సొంతం చేసుకోవడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. మరోవైపు పాకిస్తాన్ కూడా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు అమెరికా సాయం కోరుతున్న విషయం తెలిసిందే. అయితే పీవోకేను సొంతం చేసుకోవం వల్ల భారత్‌కు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.


పీవోకే వల్ల కలిగే ప్రయోజనాలివే..

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను (Pakistan Occupied Kashmir) భారత్ సొంతం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రాంతం భారత్‌లో (India) అంతర్భాగమైనా.. విభజన తర్వాత జరిగిన అనేక పరిణామాల కారణంగా విడిపోయింది. తర్వాత పాకిస్తాన్ (Pakistan) ఈ ప్రాంతాన్ని ఉగ్రవాద స్థావరంగా మార్చింది. ఇక్కడ టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి, వారిని భారత్‌‌లోకి పంపించి విధ్వంసానికి పాల్పడుతోంది.


Russia-to-india-oli-import.jpg

రష్యా నుంచి నేరుగా రావొచ్చు..

పీవోకేలోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతం భారతదేశానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడి నుంచి ఆసియా, ఆఫ్ఘనిస్తాన్‌లకు (Asia, Afghanistan) చేరుకోవాలంటే.. పాకిస్తాన్ లేదా ఇరాన్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే పీవోకే మనదే అయితే నేరుగా చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే రష్యా (Russia) నుంచి భారత్ ఆయిల్‌ను సముద్ర మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈ పీవోకేను స్వాధీనం చేసుకోవడం వల్ల రష్యా నుంచి నేరుగా పైప్‌లైన్ ఏర్పాటు చేసి ఆయిల్‌ను దిగుమతి చేసుకునే వీలుంటుంది.


Pakistan-Occupied-Kashmir-t.jpg

చైనాకు చెక్ పెట్టొచ్చు ఇలా..

మరోవైపు పీవోకే చాలా దేశాలతో సరిహద్దులు కలిగి ఉండడంతో చైనా తన వాణిజ్యపరమైన అంశాలకు పీవోకేను వేదికగా చేసుకుంటూ వస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ , కజకిస్తాన్, ఉజ్జికిస్తాన్ (Afghanistan, Kazakhstan, Uzbekistan) తదితర దేశాలతో పీవోకే సరిహద్దు కలిగి ఉండడంతో చైనాకు (China) వీలుగా మారింది. ఈ పీవోకేను స్వాధీనం చేసుకోవడం వల్ల చైనాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక సహజ వనరులు ఉన్నాయి.


ప్రధానంగా పీవోకే ప్రాంతంలో అణుశక్తిని ఉత్పత్తి చేసేందుకు అవరసమైన యురేనియం కూడా ఇక్కడ లభిస్తుంది అలాగే నీలం, జీలం నదుల సాయంతో జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది. ఇక్కడి వనరులను ఉపయోగించి, జమ్మూ కశ్మీర్‌ను సస్యశ్యామలం చేసేందుకు అవకాశం ఉంటుంది. పనిలో పనిగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకూ వీలుంటుంది. పీవోకేను స్వాధీనం చేసుకోవడం వల్ల భారత్‌ ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే కాకుండా ఇలా అనేక ప్రయోజనాలు ఉంటాయి.


Also Read:

ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్..ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..

టర్కీ నుంచి దిగుమతులు ఆగిపోతే.. వీటి రేట్లు విపరీతంగా పెరుగుతాయి

కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 16 , 2025 | 09:18 AM