Share News

Bihar: పాపులర్ సీఎం ఫేస్ తేజస్వి, వెనుకబడిన నితీష్.. సర్వే వెల్లడి

ABN , Publish Date - Jul 23 , 2025 | 06:15 PM

యువకుల్లో తేజస్వికి మంచి పాపులారిటీ ఉన్నట్టు సర్వే తెలిపింది. ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 25-34 సంవత్సరాల మధ్య ఉన్న 40 శాతం మంది యువకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 22 మంది నితీష్ వైపు మొగ్గుచూపారు.

 Bihar: పాపులర్ సీఎం ఫేస్ తేజస్వి, వెనుకబడిన నితీష్.. సర్వే వెల్లడి
Tejashwi Yadav and Nitish Kumar

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ రాష్ట్రీయ జనతా దళ్ (RJD)కు ఓ సర్వే చల్లటి కబురు చెప్పింది. బీహార్‌ తదుపరి సీఎంగా ఎవరైతే బాగుంటుందనే విషయంలో తేజస్వి యదవ్‌ వైపే ఆ రాష్ట్ర ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఆ తరువాత స్థానంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నారని ఆ సర్వే పేర్కొంది. మూడో స్థానంలో జన్‌ సురాజ్ పార్టీ వ్యవస్థాపడు ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టు వెల్లడించింది. 'ఓట్ వైబ్' (Vote Vibe) ఈ సర్వే నిర్వహించింది.


సర్వే ఫలితాల ప్రకారం, సీఎం విషయంలో తేజస్వికి 32.1 శాతం ప్రజలు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. 25 శాతం ప్రజలు నితీష్ వైపు, 12.4 శాతం ప్రజలు ప్రశాంత్ కిషోర్ వైపు మొగ్గుచూపారు. ప్రశాంత్ కిషోర్ తరువాత నాలుగో స్థానంలో లోక్ జనశక్తి పార్టీ సుప్రీం చిరాగ్ పాశ్వాన్ నిలిచారు. ఆయన వైపు 9.4 శాతం ప్రజలు మొగ్గుచూపారు.


యూత్‌లో పాపులర్

యువకుల్లో తేజస్వికి మంచి పాపులారిటీ ఉన్నట్టు సర్వే తెలిపింది. ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 25-34 సంవత్సరాల మధ్య ఉన్న 40 శాతం మంది యువకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 22 మంది నితీష్ వైపు మొగ్గుచూపారు. అయితే, 55 ఏళ్లు పైబడిన 32.4 శాతం మంది ముఖ్యమంత్రిగా నితీష్ కొనసాగాలని కోరుకోగా, ఈ ఏజ్ గ్రూప్‌కు చెందిన 19.4 శాతం మంది తేజస్విని కోరుకున్నారు.


సుదీర్ఘకాలంగా సీఎంగా ఉన్న నితీష్‌కు ఆదరణ తగ్గుతోందనే ప్రచారం కొద్దికాలంగా జరుగుతున్న క్రమంలో తాజా సర్వే వెలువడింది. అయితే బీజేపీ మాత్రం నితీష్ సారథ్యంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని చెబుతోంది. నితీష్ తరచు పార్టీలు మారుస్తుంటారనే అభిప్రాయం ఉన్నప్పటికీ ఇక అలాంటిదేమీ జరగదని, తాను ఇక ఎన్నటికీ ఎన్డీయేలోనే ఉంటానని నితీష్ పలుమార్లు ప్రకటించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ఇంకా ప్రకటించనప్పటికీ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్-నవంబర్ మాసాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.


ఇవి కూాడా చదవండి..

అల్‌ఖైదా కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదుల అరెస్టు

ఇంద్రభవనం, ఫ్యాన్సీ కార్లు.. నకిలీ రాయబార కార్యాలయం గుట్టురట్టు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 06:21 PM