Share News

Supreme Court: చిన్నారుల మిస్సింగ్‌పై సుప్రీంకోర్టు ఆందోళన

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:15 PM

చిన్నారుల మిస్సింగ్‌పై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. చిన్నారుల మిస్సింగ్ అంశంపై జిల్లాకు ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని గత విచారణలో సూచించినట్లు సుప్రీంకోర్టు గుర్తుచేసింది.

Supreme Court: చిన్నారుల మిస్సింగ్‌పై సుప్రీంకోర్టు ఆందోళన
Supreme Court

ఢిల్లీ, నవంబరు18(ఆంధ్రజ్యోతి): ఇటీవల పలు రాష్ట్రాల్లో చిన్నారుల మిస్సింగ్‌ (Children Missing)పై మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు (Supreme Court) దృష్టికి వచ్చింది. చిన్నారుల మిస్సింగ్‌పై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇవాళ(మంగళవారం) చిన్నారుల మిస్సింగ్‌ అంశంపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేసింది న్యాయస్థానం. ప్రతి ఎనిమిది నిమిషాలకొక చిన్నారి మిస్ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న తెలిపారు.


ఈ క్రమంలో దత్తత నిబంధనలు సరళీకృతం చేయాలని సూచించారు. పిల్లల దత్తత నిబంధనలు కఠినతరంగా ఉండటం వల్ల అక్రమ పద్ధతుల్లో దత్తత తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు నాగరత్న. చిన్నారుల మిస్సింగ్ అంశంపై జిల్లాకు ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని గత విచారణలో సూచించింది సుప్రీంకోర్టు. తెలంగాణలో అక్రమ దత్తత వ్యవహారంలో పలు కేసులు బయటకు వచ్చాయని న్యాయవాది గుర్తుచేశారు. ఈ విషయంపై అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి దిగుమతులు మూడింతలు

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ కార్లకు భలే డిమాండ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 18 , 2025 | 12:34 PM