Sri Ramulu: ముఖ్యమంత్రిని మార్చే పనిలో కాంగ్రెస్ నేతలు బిజీ..
ABN , Publish Date - Jul 10 , 2025 | 01:22 PM
కాంగ్రెస్‌లో ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిని మార్చేందుకు డిల్లీ కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. సీఎం సిద్దరామయ్య పదవి నుంచి దిగినా డీకే శివకుమార్ సీఎం అయ్యేందుకు సిద్దరామయ్య మద్దత్తు ఇవ్వడు.

- సిద్దరామయ్య సీజనల్ పొలిటీషియన్
- డీకే శివకుమార్‌ను ఆయన ముఖ్యమంత్రిగా ఒప్పుకోరు
- నాగేంద్ర జైలుకు పోవచ్చు: మాజీ ఎంపీ శ్రీరాములు
బళ్లారి(బెంగళూరు): కాంగ్రెస్‌లో ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిని మార్చేందుకు డిల్లీ కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. సీఎం సిద్దరామయ్య పదవి నుంచి దిగినా డీకే శివకుమార్ సీఎం అయ్యేందుకు సిద్దరామయ్య మద్దత్తు ఇవ్వడు. ఎందుకంటే సిద్దరామయ్య సీజనల్ పొలిటీషియన్ ఎప్పుడు ఎలా ఉండాలో, రాజకీయ చదరంగా ఎలా ఆడాలో ఆయనకు బాగా తెలుసని మాజీ ఎంపీ బి. శ్రీరాములు(Sri Ramulu) అభిప్రాయపడ్డారు. బుధవారం బళ్లారిలోని తన వివాసంలో బీజేపీ కార్పొరేటర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రె్‌సలో ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తరువాత సీఎం మార్చాలని, కానీ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్దరామయ్య ఒప్పుకోరన్నారు. ఆయన ఆర్ పాటిల్, పరమేశ్వర్, మల్లికార్జున ఖర్గే, సతీష్ జార్కిహొళి. వీరు కాదంటే కృష్ణబైరేగౌడ పేర్లను ప్రతిపాదిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు ముఖ్య మంత్రిని మార్చడానికే కాలం సాగిస్తున్నారని ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. సుర్జేవాలా బెంగళూరులో మకాం వేసి డిల్లీ రాజకీయం ఆడుతున్నాడన్నారు. సమావేశంలో గుడిగంట హనుమంత, మల్లనగౌడ, వెంకటరెడ్డి. వీరశేఖర్‌రెడ్డి, వెంకటేశులు, బీజేపీ కార్పొరేటల్లు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఉపయోగించింది ఎస్టీ నిగమ మండలి సొమ్మే..
ఎస్టీ నిగమ మండలిలో రూ.189 కోట్లు డబ్బులు డ్రా చేసి నారా భరత్‌రెడ్డి, కంప్లి గణేష్, నాగరాజు, శ్రీనివాసులు, తుకారం, సంతోష్ లాడ్ ఇలా అందరూ ఎమ్మెల్యేలు ఎస్టీ నిగమ మండలి డబ్బులు దుర్వినియోగం చేశారని శ్రీరాములు ఆరోపించారు. ఎస్టీ నిగమ మండలిలో జరిగిన అక్రమాల్లో నాగేంద్రకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందన్నారు. బళ్లారి పాలికెలో అభివృద్ధి పనులు జరగం లేదని, బీజేపీ కార్పొరేటర్లు ఉండే ఏరియాకు నిధులు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికే నగర పాలికె సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు లేక రోడ్డున ఎక్కారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే
Read Latest Telangana News and National News