Special Trains: జూలై 2 నుంచి హైదరాబాద్ - కన్నియాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:58 PM
హైదరాబాద్(Hyderabad) నుంచి కన్నియాకుమారికి జూలై 2వ తేదీ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.

చెన్నై: హైదరాబాద్(Hyderabad) నుంచి కన్నియాకుమారికి జూలై 2వ తేదీ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. నెం.07230 హైదరాబాద్ - కన్నియాకుమారి ప్రత్యేక రైలు జూలై 2, 9, 16, 23 తేదీల్లో హైదరాబాద్‌లో సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరి మూడోరోజు వేకువజామున 2.30 గంటలకు కన్నియాకుమారి చేరుకుంటుంది.
నెం.07229 కన్నియాకుమారి ప్రత్యేక రైలు జూలై 4, 11, 18, 25 తేదీల్లో కన్నియాకుమారి నుంచి తెల్లవారుజామున 5.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు నెల్లూరు, గూడూరు(Nelloor, Guduru), రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి మీదుగా వెళతాయని దక్షిణ రైల్వే తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. రూ.98 వేల దిగువకు బంగారం.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎంపీ రఘునందన్‌కు మళ్లీ బెదిరింపు కాల్
Read Latest Telangana News and National News