Share News

Saif Ali Khan: సైఫ్ కేసులో పోలీసుల సంచలన నిజాలు.. నిందితుడు పక్క దేశస్తుడే

ABN , Publish Date - Jan 19 , 2025 | 09:45 AM

Mumbai Police: ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సంచలన నిజాలు బయటపెట్టారు.

Saif Ali Khan: సైఫ్ కేసులో పోలీసుల సంచలన నిజాలు.. నిందితుడు పక్క దేశస్తుడే
Saif Ali Khan

సినీ పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కేసు. అతడిపై ఓ దుండగుడు కత్తితో అమానుషంగా దాడి చేయడం సంచలనంగా మారింది. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు సైఫ్. ఈ కేసులో నిందితుడి కోసం తీవ్రంగా గాలించిన బాండ్రా పోలీసులు ఎట్టకేలకు అతడ్ని పట్టుకున్నారు. తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన పోలీసులు ఈ కేసులో సంచలన విషయాలు వెల్లడించారు. సైఫ్ మీద దాడి చేసిన వ్యక్తి పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని తెలిపారు. అతడ్ని అరెస్ట్ చేశామని వెల్లడించారు. పోలీసులు ఇంకా ఏం చెప్పారంటే..


సైఫ్ ఇంటికి ఎందుకెళ్లాడంటే..!

సైఫ్ మీద దాడి చేసిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ఇక్కడి వాడు కాదని.. అతడు బంగ్లాదేశ్ వాసి అని పోలీసులు తెలిపారు. అతడి వయసు 30 సంవత్సరాలు అని.. 6 నెలలుగా ముంబైలో ఉంటున్నాడని పేర్కొన్నారు. ‘షరీఫుల్ ఇస్లాం భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డాడు. అందుకే పేరు మార్చుకున్నాడు. విజయ్ దాస్ అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్నాడు. హౌజ్ కీపింగ్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. సైఫ్ ఇంటికి దొంగతనం కోసం వెళ్లాడు. అతడ్ని త్వరలో కోర్టులో ప్రవేశపెడతాం’ అని ముంబై డీసీపీ స్పష్టం చేశారు.


ఇవీ చదవండి:

మీ ఈపీఎఫ్‌ వ్యక్తిగత వివరాల్లో మార్పులు మీరే చేసుకోవచ్చు!

అద్దెకు ఉండే వారికి ఉచిత విద్యుత్తు, నీరు

ఫుట్‌బాల్‌ కోసం 30లక్షల వీధి కుక్కల హతం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 19 , 2025 | 09:55 AM