Rekha Gupta: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన రేఖా గుప్తా
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:47 PM
షాలిమార్ భాగ్ నివాసం వద్ద తనను అభినందించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలందరికీ రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను ఆమోదించినట్టు తెలిపారు.

న్యూఢిల్లీ: కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేఖాగుప్తా (Rekha Gupta) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను శుక్రవారంనాడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌ను సైతం కలుసుకున్నారు. దీనికిముందు షాలిమార్ భాగ్ నివాసం వద్ద తనను అభినందించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలందరికీ రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను ఆమోదించినట్టు తెలిపారు. తక్కిన అంశాలను కూడా తదుపరి మంత్రివర్గం సమావేశంలో చర్చిస్తామని చెప్పారు.
PM Modi SOUL Conclave: అన్నిరంగాల్లో విజనరీ నేతలు తయారు కావాలి.. సోల్ సదస్సులో మోదీ
రామ్‌లీలా మైదానంలో గురువారంనాడు జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనా ఆమె చేత, ఆమె మంత్రివర్గం చేత ప్రమాణస్వీకారం చేయించారు. పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
''గురువారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను ఆమోదించాం. స్కీమ్ వివరాలను త్వరలో ప్రజల ముందుకు తెస్తాం. ఈరోజు పీడబ్ల్యూబీ, జల్ బోర్డు అధికారులతో క్యాబినెట్ సమావేశమవుతోంది. రోడ్లపై గుంతల సమస్యను అధికారులతో చర్చిస్తాం" అని మీడియాతో మాట్లాడుతూ రేఖా గుప్తా తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Eknath Shinde: నన్ను ఆషామాషీగా తీసుకోవద్దు.. డిప్యూటీ సీఎం హెచ్చరిక
DK Shiva Kumar: బెంగళూరు స్థితిని దేవుడు కూడా మార్చలేడు.. డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
Birthday: వారం ముందే సీఎం స్టాలిన్ జన్మదిన వేడుకలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.