Ranya Rao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. సవతి తండ్రి పాత్రపై దర్యాప్తు
ABN , Publish Date - Mar 11 , 2025 | 03:08 PM
రన్యారావు బంగారం తరలించే సమయంలో విమానాశ్రయంలో వీఐపీ ప్రోటాకాల్‌ను దుర్వినియోగం చేశారని, తన సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రారావు పేరును ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

బెంగళూరు: దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా (Gold Smuggling) చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఆమె బంగారం తరలించే సమయంలో విమానాశ్రయంలో వీఐపీ ప్రోటాకాల్‌ను దుర్వినియోగం చేశారని, తన సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రారావు పేరును ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రామచంద్రరావు ప్రమేయంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. కేసు విచారణ అధికారిగా అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను నియమించింది. వారం రోజుల్లోగా నివేదికను అందించాలని కూడా ప్రభుత్వం ఆయనను ఆదేశించింది.
BJP Leader: బీజేపీ నేతకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి హత్య..
రన్యారావును బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మార్చి 3న డైరెక్టరేట్ ఆప్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేశారు. ఆమెనుంచి దుబాయి నుంచి అక్రమంగా తీసుకు వస్తున్న 14.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రన్యారావు నివాసంపై దాడి చేసి మరి కొంత బంగారం కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు రామచంద్రరావు పలుకుబడిన ఆమె ఉపయోగించుకుని ఉండవచ్చని ఇన్వెస్టిగేటర్లు అనుమానిస్తున్నారు. 15 రోజుల వ్యవధిలో దుబాయ్‌కు ఆమె నాలుగుసార్లు వెళ్లొచ్చినట్టు దర్యాప్తు అధికారుల చెబుతున్నారు. రన్యారావును మార్చి 4న ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా 3 రోజుల డీఆర్ఐ కస్టడీకి కోర్టు అప్పగించింది. అది ముగియడంతో మార్చి 18 వరకూ ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అప్పగించింది.
రామచంద్రరావు ఎవరు?
1993 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రామచంద్రరావు 2023 సెప్టెంబర్‌లో డీజీపీ ర్యాంకుకు ప్రమోట్ అయ్యారు. దీనికి ముందు ఆయనపై వివాదాలు కూడా ఉన్నాయి. 2014లో ఆయన సదరన్ రేంజ్ ఐజీపీగా ఉన్నప్పుడు మైసూరులోని ఓ ప్రైవేటు బస్సులో రూ.20 లక్షల సొమ్ము పట్టుబడింది. అయితే డబ్బును పట్టికెళ్తున్న వ్యాపారులు అందులో రూ.2.27 కోట్లు ఉన్నట్టు ఆరోపించారు. కాగా, రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో పట్టుబడటంతో దీనిపై రామచంద్రరావు ఆచితూచి స్పందించారు. "నా కుమార్తె కార్యకలాపాలతో నాకెలాంటి సంబంధం లేదు. నాలుగు నెలల క్రితం ఆమెకు పెళ్లయింది. అప్పటి నుంచి ఆమెతో ఎలాంటి సంప్రదింపులు లేవు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Ranya Rao: రన్యారావుకు పొలిటికల్ లింక్స్.. దుమ్మెత్తి పోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్
Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.