Share News

Ranya Rao Case: ప్రతి ట్రిప్‌లో రూ.12 లక్షలు.. నటి రన్యా రావు కేసులో సంచలన నిజాలు

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:12 PM

Sandalwood: ప్రముఖ కన్నడ నటి రన్యా రావు కేసులో విస్తుగొలిపే రీతిలో ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఆమె గోల్డ్ స్మగ్లింగ్ చేసిన తీరు, ప్రతి ట్రిప్ మీద సంపాదించిన మొత్తం గురించి వినిపిస్తున్న వార్తలు అందర్నీ షాక్‌కు గురిచేస్తున్నాయి.

Ranya Rao Case: ప్రతి ట్రిప్‌లో రూ.12 లక్షలు.. నటి రన్యా రావు కేసులో సంచలన నిజాలు
Ranya Rao

ప్రముఖ నటి రన్యా రావు కేసు కన్నడ చిత్రసీమను ఊపేస్తోంది. బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యా దొరికిపోవడం సంచలనంగా మారింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రన్యా దగ్గర నుంచి భారీ మొత్తంలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 15 కిలోల పసిడి ఆమె వద్ద దొరికిందని, దీని విలువ రూ.12.56 కోట్లు అని సమాచారం. ఈ కేసులో ఒక్కొక్కటిగా విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ప్రతి ట్రిప్ ద్వారా రూ.12 లక్షలకు పైనే మొత్తాన్ని రన్యా వెనకేసుకుంటూ వచ్చిందని తెలుస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


30 సార్లు దుబాయ్‌కు..

గత ఏడాది కాలంలో రన్యా రావు 30 సార్లు దుబాయ్‌కు రాకపోకలు సాగించిందట. ఇలా ట్రిప్‌కు వెళ్లిన ప్రతిసారి కిలోల కొద్దీ బంగారాన్ని తన వెంట తీసుకొచ్చేదట. అక్రమంగా తరలించినందుకు ప్రతి కిలో బంగారం మీద ఆమె రూ.1 లక్ష అందుకునేదని సమాచారం. అలా ప్రతి దుబాయ్ ట్రిప్ ద్వారా దాదాపుగా రూ.12 నుంచి రూ.13 లక్షల వరకు అందుకునేదట. స్మగ్లింగ్ ఆపరేషన్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన జాకెట్స్, వెస్ట్ బెల్ట్స్‌ను రన్యా రావు ఉపయోగించేదని వినిపిస్తోంది. ఇవే జాకెట్స్, బెల్ట్స్‌ను ఆమె రాకపోకలకు వినియోగించేదని తెలుస్తోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఆమె ధరించిన ఆ జాకెట్‌లో భారీగా బంగారు బిస్కెట్లు, కడ్డీలు ఉన్నాయని సమాచారం.


నా కూతురు ఇలా చేస్తుందనుకోలేదు..

దుబాయ్‌కు పదే పదే ట్రిప్స్‌కు వెళ్తుండటంతో పోలీసులు రన్యా రావు మీద ఫోకస్ పెంచారట. ఆమె రాకపోకలతో పాటు ఇతర విషయాల మీదా దృష్టి పెట్టారట. అలా బుధవారం నాడు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన క్రమంలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన రన్యా.. తాను ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావు కూతుర్ని అని చెప్పినట్లు సమాచారం. కాగా, ఈ మొత్తం వ్యవహారంపై ఐపీఎస్ రామచంద్రరావు విస్మయం వ్యక్తం చేశారు. తన కూతురు ఇలా చేస్తుందని అనుకోలేదన్నారు. అయినా రన్యా తమతో ఉండట్లేదని.. భర్తతో కలసి సెపరేట్‌గా ఉంటోందన్నారు. ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, తన కెరీర్‌లో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదని రామచంద్రరావు స్పష్టం చేశారు.


ఇవీ చదవండి:

రాహుల్‌గాంధీకి రూ.200 జరిమానా

పడవ నడిపి 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించాడు.. సీఎం యోగి..

పరీక్ష తప్పిన రాజీవ్‌ ప్రధాని ఎలా అయ్యారో?!

మరిన్ని జాతీయ వాార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2025 | 12:25 PM