Share News

Rajasthan Plane Crash: రాజస్థాన్‌లో కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం..

ABN , Publish Date - Jul 09 , 2025 | 02:09 PM

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. రతన్‌గఢ్ సమీపంలో మధ్యాహ్న సమయంలో వైమానిక దళ విమానం కుప్పకూలిపోయింది. ఫైటర్ జెట్ పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.

Rajasthan Plane Crash: రాజస్థాన్‌లో కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం..
Rajasthan IAF Fighter Jet Crash

Rajasthan IAF Fighter Jet Crash: భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ రాజస్థాన్‌లోని చురు జిల్లాలో బుధవారం కుప్ప కూలిపోయింది. భనోడా గ్రామంలో మధ్యాహ్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ శబ్దంతో ఐఏఎఫ్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమందించగా సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో ఇద్దరు పైలట్ల మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు నిర్ధారించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.


చురు జిల్లాలోని భనోడా గ్రామంలో ఐఏఎఫ్ యుద్ధ విమానం అకస్మాత్తుగా వ్యవసాయ క్షేత్రంలో పెద్ద శబ్దంతో కుప్పకూలింది. సుమారు 12.40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్ఎస్ఓ కమలేష్ తెలిపారు. పేలుడు కారణంగా మంటల్లో చిక్కుకుని జెట్ దాదాపు కాలిపోయింది. విమాన శకలాల మధ్య ఇద్దరు పైలట్ల మృతదేహాలు బయటపడ్డాయి. చెడు వాతావరణమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.


భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ బుధవారం మధ్యాహ్నం రాజస్థాన్‌లోని చురు జిల్లాలో కుప్పకూలినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, జాగ్వార్ విమానం కుప్పకూలడం ఇది రెండోసారి. అదీ మూడు నెలల వ్యవధిలోనే. గత నెల ఏప్రిల్‌లో గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు సమీపంలో రొటీన్ ట్రైనింగ్ సెషన్‌లో జాగ్వార్ విమానం కూలిపోయింది. ఆ ఘటనలో ఇద్దరు పైలట్లలో ఒకరు సురక్షితంగా బయటపడగా, మరొకరు మృతిచెందారు.


ఇవి కూడా చదవండి..

డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్, కృష్ణకు బెయిల్

రూ. 5 కోట్ల ఆర్థిక నేరం.. భారత్‌కు మోనికా కపూర్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 09:47 PM