Share News

Pune Bus Rape Case : చెరుకు తోటలో దాక్కున్న నిందితుడు.. పోలీసులు ఏం చేశారంటే..

ABN , Publish Date - Feb 27 , 2025 | 04:45 PM

Pune Bus Rape Case : పూణే బస్సు అత్యాచార ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉన్న బస్టాండ్‌లో మహిళపై నిర్భయంగా దారుణానికి పాల్పడి చెరకు తోటల్లో దాక్కున నిందితుడిని..

Pune Bus Rape Case : చెరుకు తోటలో దాక్కున్న నిందితుడు.. పోలీసులు ఏం చేశారంటే..
Pune Bus Rape Case

Pune Bus Rape Case : దేశరాజధానిలో నిర్భయ ఘటన తర్వాత చట్టాల్లో ఎన్ని మార్పులు చేసినా మహిళలపై అత్యాచారం ఘటనల సంఖ్య కొంచెం కూడా తగ్గడం లేదు. తాజాగా పూణెలో పోలీస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలోనే ఓ వ్యక్తి ఏ మాత్రం భయం లేకుండా మహిళపై అత్యాచారం చేసి పరారయ్యాడు. దీంతో ఈ ఘటన మహారాష్ట్రలో రాజకీయంగా కలకలం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని ఎవరనేది పోలీసులు గుర్తించినా..


ఆగి ఉన్న బస్సులో అత్యాచారం.. ఆ తర్వాత..

మహారాష్ట్రలోని పూణేలో రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో మంగళవారం ఉదయం ఆగి ఉన్న బస్సులో 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు దత్తాత్రేయ రాందాస్‌ (36) గాడేగా గుర్తించారు పోలీసులు. ఇతడిపై ఇప్పటికే దొంగతనం, దోపిడి కింద 6కు పైగా కేసులున్నాయి. 2019 నుంచి బెయిల్‌పై బయట తిరుగుతున్న దుండగుడు తాజాగా మహిళపై అఘాయిత్యం చేసి పారిపోయాడు.


నిందితుడిని పట్టిస్తే రూ.లక్ష..

నిందితుడిని పట్టుకునేందుకు 13 ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనా స్థలానికి దగ్గర్లో ఉన్న చెరకు తోటలో డ్రోన్లతో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. కాగా, అత్యాచారం చేశాక నిందితుడు సమీపంలోనే ఉన్న చెరకు తోటలో దాక్కుని.. కాసేపయ్యాక కూరగాయలు తీసుకెళ్తున్న ట్రక్కులో తప్పించుకుని వెళ్లాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని పట్టించినవారికి రూ.లక్ష బహుమతిని ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే స్పందించారు. త్వరలో నిందితుడి పట్టుకుంటామని హామీ ఇచ్చారు.


అక్కా అని పిలిచి.. బస్టాండ్‌లో..

పోలీసులు తెలిపిన ప్రకారం, ఉదయం 5.45 నుండి 6.30 గంటల మధ్య ఘటన జరిగింది. సొంతూరికి వెళ్లేందుకు బస్టాండ్‌లో ఉన్న బాధితురాలితో అక్కా అంటూ రాందాస్ మాట్లాడటంతో.. గ్రామానికి వెళ్లే బస్సు గురించి ఆమె అడిగింది. ఇది అవకాశంగా తీసుకుని ఇక్కడే పక్కనే ఉందంటూ చీకట్లో ఆగి ఉన్న బస్సులోకి తీసుకెళ్లాడు నిందితుడు. లైట్లు లేకపోవడంతో బాధితురాలు వెళ్లేందుకు సంకోచించినా.. ప్రయాణీకులు నిద్రపోతున్నారని నమ్మించి బస్సులోకి వెళ్లగానే తలుపు వేసి అత్యాచారం చేశాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది.


Read Also : Recharge Offer: రూ. 108కే మంత్లీ రీఛార్జ్.. డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాల్స్ కూడా..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్.. యూజర్ల ఫిర్యాదులు, అసలేమైంది..

IPL 2025: అలాంటోడు మళ్లీ వస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలే..

Updated Date - Feb 27 , 2025 | 04:47 PM