PM Modi: 3 రాష్ట్రల్లో మోదీ పర్యటన
ABN , Publish Date - Feb 22 , 2025 | 05:20 PM
మధ్యప్రదేశ్‌లో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌ను మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇన్వెస్టర్స్ సమ్మట్‌ను సోమవారంనాడు ప్రారంభిస్తారు. అసోంలో జుమోయిర్ బినాందిని కార్యక్రమంలో పాల్గొంటారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మూడు రోజల పర్యటన ఆదివారం మొదలవుతుంది. మధ్యప్రదేశ్ (Mahdya Pradesh), బీహార్ (Bihar), అసోం (Assam) రాష్ట్రాల్లో 23 నుంచి 25 వరకూ ఆయన పర్యటన సాగుతుంది. మధ్యప్రదేశ్‌లో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌ను మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇన్వెస్టర్స్ సమ్మట్‌ను సోమవారంనాడు ప్రారంభిస్తారు. అసోంలో జుమోయిర్ బినాందిని కార్యక్రమంలో పాల్గొంటారు. అసోంలో టీ పరిశ్రమ, పారిశ్రామికీకరణ జరిగి 200 ఏళ్లు అయిన సందర్భంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
మధ్యప్రదేశ్‌లో..
పీఎం పర్యటన వివరాల ప్రకారం, 23వ తేదీన ఆయన మధ్యప్రదేశ్‌లి ఛాతర్‌పూర్ జిల్లాలో పర్యటిస్తారు. మధ్యహ్నం 2 గంటలకు బాగేశ్వర్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు శంకుస్థాపన చేస్తారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు భోపాల్‌లో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. 60 దేశాలకు చెందిన ప్రతినిధినులు, వివిధ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన అధికారులు, ఇండియాకు చెందిన 300 మందికి పైగా ప్రముఖ పారిశ్రామిక నేతలు తదితరులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు.
బీహార్‌లో...
ప్రధాని 24వతేదీ ఉదయం 2.15 గంటలకు బీహార్‌లోని భాగల్‌పూర్ చేరుకుంటారు. పీఎం కిసాన్ స్కీమ్ 19వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేస్తారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం, జాతికి అంకితం చేయడం చేస్తారు.
అసోంలో..
ప్రధాని 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు గౌహతి చేరుకుంటారు. మెగా ఝుమోయిర్ 2025 ప్రోగ్రాంలో పాల్గొంటారు. 25వతేదీ ఉదయం 10.45 గంటలకు గౌహతిలో జరిగే అడ్వాంటేజ్ అసోం 2.0 ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025లో పాల్గొంటారు. ఈ సదస్సులో వివిధ అంతర్జాతీయ సంస్థలు, గ్లోబల్ లీడర్లు, పెట్టుబడిదారులు, విధాననిర్ణేతలు, పరిశ్రమ నిపుణులు, స్టార్టప్స్, విద్యార్థులు తదితరులు పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Air India: ఎయిర్ ఇండియాపై కేంద్ర మంత్రి ఫైర్.. ప్రజలను మోసగిస్తున్నారంటూ గుస్సా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.