MP: రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి తావులేదు..
ABN , Publish Date - Apr 18 , 2025 | 01:41 PM
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి తావులేదని అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై అన్నారు. 2026లో ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనా.. మిత్రపక్షాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు.

- అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై
చెన్నై: రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని, భవిష్యత్తులోనూ జరగదని అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై(AIADMK MP Tambidurai) స్పష్టం చేశారు. గిండిలో స్వాతంత్య్ర సమరయోధుడు ధీరన్ చిన్నమలై విగ్రహం వద్ద పార్టీ తరఫున ఆయన నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే యేడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే- బీజేపీ కూటమి గెలిస్తే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందా? బీజేపీకి అధికార భాగస్వామ్యం కల్పిస్తారా? అంటూ ఇటీవల పలు వర్గాలు, ప్రత్యర్థుల నుండి అనుమానాలు బయలుదేరుతున్నాయని, అయితే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు తావులేదన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: MLA: అసెంబ్లీలో నవ్వులు పూయించిన ఎమ్మెల్యే.. ఆయన ఏమన్నారంటే..
1952లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ద్వితీయ స్థానం దక్కిందని, ఆ సమయంలో ఇతర పార్టీల మద్దతుతో కాంగ్రెస్ నేత రాజాజీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, మిత్రపక్షాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించలేదన్నారు. కామరాజర్ రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, అప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాలేదన్నారు. 1977లో ఎంజీఆర్ అధికారంలోకి వచ్చినా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. 2006లో డీఎంకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైందని,
అప్పట్లో కాంగ్రెస్ నాయకుడు ప్రణబ్‌ముఖర్జీ కాంగ్రెస్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఒత్తిడి చేసినా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పట్టించుకోలేదని, ఆ సమయంలో కాంగ్రెస్‌కు అధికారంలో భాగస్వామ్యం కల్పించలేదని తంబిదురై వివరించారు. ఈ నేపథ్యంలో 2026లో ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనా మిత్రపక్షాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎడప్పాడి ఆచితూచి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
వారిద్దరిదే తుది నిర్ణయం...
అన్నాడీఎంకే - బీజేపీ కూటమి గెలిస్తే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటువుతుందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్‌ను విలేఖరులు ప్రశ్నించగా, ఈ విషయంపై అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కలిసి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని బదులిచ్చారు. శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టడమే రెండు పార్టీల ఏకైక లక్ష్యమని, ప్రస్తుతం ఆ దిశగానే రెండు పార్టీలూ కలిసి పనిచేస్తాయని ఆయన చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
సీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ సవాల్
అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News