Share News

High court: హైకోర్టు ప్రశ్న.. ఐఏఎస్‌ అధికారి కోర్టు కంటే గొప్పవారా..

ABN , Publish Date - Jul 10 , 2025 | 11:27 AM

ఐఏఎస్‌ అధికారి కోర్టు కంటే గొప్పవారా అని జీసీసీ కమిషనర్‌ కుమరగురుపరన్‌ను ఉద్దేశించి మద్రాస్‌ హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉల్లంఘన కేసులో గురువారం విచారణకు తప్పనిసరిగా హాజరుకావల్సిందేనని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.

High court: హైకోర్టు ప్రశ్న.. ఐఏఎస్‌ అధికారి కోర్టు కంటే గొప్పవారా..

- జీసీసీ కమిషనర్‌ను ప్రశ్నించిన మద్రాస్‌ హైకోర్టు

చెన్నై: ఐఏఎస్‌ అధికారి కోర్టు కంటే గొప్పవారా అని జీసీసీ కమిషనర్‌ కుమరగురుపరన్‌ను ఉద్దేశించి మద్రాస్‌ హైకోర్టు(Madras Highcourt) ప్రశ్నించింది. కోర్టు ఉల్లంఘన కేసులో గురువారం విచారణకు తప్పనిసరిగా హాజరుకావల్సిందేనని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. జీసీసీ పరిధిలోని ఐదవ జోన్‌ రాయపురంలో అనుమతి లేకుండా నిర్మించిన భవనాలపై జీసీసీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు చట్టవిరుద్ధ నిర్మాణాలపై చర్యలు తీసుకోవల్సిందిగా 2021 డిసెంబర్‌లో ఉత్తర్వులు జారీచేసింది.


అయితే ఎటువంటి చర్యలు తీసుకోని జీసీసీకి వ్యతిరేకంగా రుక్మాంగదన్‌ హైకోర్టులో కోర్టు ఉల్లంఘన కేసు దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్‌ విచారణకు రాగా, హైకోర్టు ప్రథమ ధర్మాసనం ముందు అడినల్‌ సోలిసిట్‌ జనరల్‌ జె.రవీంద్రన్‌ హాజరై జీసీసీ కమిషనర్‌కు విధించిన రూ.లక్ష జరినామా ఉత్తర్వులను రద్దుచేయాలని కోరారు. అప్పుడు జోక్యం కలుగజేసుకున్న ప్రధాన న్యాయమూర్తి శ్రీరామ్‌ తన అభిప్రాయాలను వ్యక్తంచేశారు.


nani2.2.gif

తన తరుఫు న్యాయవాదులు సమర్పించే ప్రమాణపత్రాలను చదవకుండా సంతకం పెడితే ఆయన కమిషనర్‌గా ఉండేందుకు అర్హత లేదన్నారు. కోర్టు కంటే ఐఏఎస్‌ అధికారి గొప్పవారా అని మందలింపు ధోరణిలో ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. కోర్టు ఉల్లంఘన కేసు విచారణకు మంగళవారం హాజరుకాని జీసీసీ కమిషనర్‌ కుమరగురుపరన్‌ గురువారం తప్పనిసరిగా హాజరుకావల్సిందేనని ఉత్తర్వులు జారీచేశారు


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

Read Latest Telangana News and National News

Updated Date - Jul 10 , 2025 | 11:27 AM