Kushboo: హీరో విజయ్‌కి ఖుష్బూ ఆహ్వానం.. కలిసి నడుద్దాం.. మా కూటమిలోకి రండి
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:17 AM
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమితో కలిసి పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌కి విజ్ఞప్తి చేశారు. విజయ్ తనకు చిన్న తమ్ముడు లాంటివాడని, డీఎంకేను ఓడించేందుకు తమ కూటమిలో చేరాలని సూచించారు.

చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమితో కలిసి పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ(Kushboo) ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్(Vijay)కి విజ్ఞప్తి చేశారు. విజయ్ తనకు చిన్న తమ్ముడు లాంటివాడని, డీఎంకేను ఓడించేందుకు తమ కూటమిలో చేరాలని సూచించారు. చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఏర్పాటుకావడం సంతోషంగా ఉందన్నారు.
విజయ్ ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చారని, వచ్చిన వెంట నే విజయాలు రావని, ఈ విషయం విజయ్ కూడా బాగా తెలుసని వ్యాఖ్యానించారు. సినిమాల్లో అగ్రస్థానంలో వున్నా... రాజకీయాల్లోకి వారు ఆశించిన విజయాలు దక్కవన్నారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత కాలం వేరని, ప్రస్తుతం కాలం మారిందన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే(DMK)కు ఓడించాలని విజయ్ పిలుపునిచ్చారని, అదే నినాదంతో తామున్నామని తెలిపారు. డీఎంకేను గద్దె దింపాలని అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఏర్పాటైందని,
ఈ కూటమిలోకి విజయ్ రావాలని ఖుష్బూ పిలుపునిచ్చారు. అలాగే, బీజేపీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయనున్నామన్నారు. ముఖ్యం గా, దక్షిణ చెన్నై పరిధిలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాలను నలుగురు ఉపాధ్యక్షులతో పర్యవేక్షిస్తున్నామని, ఇంటింటికీ వెళ్లి ప్రధాని మోదీ దేశాభివృద్ధికి చేస్తున్న కృషితో పాటు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న చేయూత గురించి వివరించనున్నామని ఖుష్బూ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..
Read Latest Telangana News and National News