Home » Kushboo
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమితో కలిసి పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌కి విజ్ఞప్తి చేశారు. విజయ్ తనకు చిన్న తమ్ముడు లాంటివాడని, డీఎంకేను ఓడించేందుకు తమ కూటమిలో చేరాలని సూచించారు.
అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై డీఎంకే(DMK) ప్రభుత్వం నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమారతి నేతృత్వంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు, ప్రముఖ నటి ఖుష్బూ ఆధ్వర్యంలో మదురైలో శుక్రవారం నిరసన ప్రదర్శన చేశారు.
రాష్ట్రంలో 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi), హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) రూపొందించబోయే కొత్త వ్యూహరచనతో పాలనలో మార్పు తథ్యమని, బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ కార్యాచరణ కమిటీ సభ్యురాలు, నటి ఖుష్బూ పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాచరణ అధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) నియమితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే తమపార్టీ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ప్రకటన వస్తుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
మహిళల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ జాతీయ కమిటీ సభ్యురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ప్రముఖ నటి ఖుష్బూ(Khushboo) ఈనెల 4 నుంచి ప్రచారం చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వ పదవిలో ఉండటం వల్లే తాను ఎన్డీయేకు మద్దతుగా బీజేపీ(BJP) అభ్యర్థులతో కలిసి ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) తెలిపారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ(Khushboo)ను బీజేపీ దూరం పెట్టింది.
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తరఫున 25 మంది అభ్యర్థులను రంగంలోకి దింపాలని, వారిలో ప్రజలకు సుపరిచితులైన, వాగ్ధాటి కలిగిన మహిళామణులను పోటీకి దించాలని బీజేపీ(BJP) అధిష్ఠానం నిర్ణయించింది.
బీజేపీ నేత కుష్బూ సుందర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేసిన డీఎంకే ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తిపై వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మరుగన్ ప్రకటించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లింఘించి, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిన కారణంగా శివాజీ కృషమూర్తిని పార్టీ పదవుల నుంచి, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.