Share News

KA Paul: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 21 , 2025 | 07:54 PM

ఇజ్రాయెల్ - ఇరాన్ వార్ వల్ల ఎన్నో దేశాలు ప్రభావితం అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ప్రపంచం మొత్తం ఆ యుద్ధం ఆపాలని కోరుకుంటుందని అన్నారు. ఇలా దేశాల మధ్య యుద్ధాలు ఇంకెన్నాళ్లు, ఎంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉండాలని కేఏ పాల్ ప్రశ్నించారు.

KA Paul: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు
KA Paul

ఢిల్లీ: అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్‌తో (Donald Trump) పాటు ఇజ్రాయెల్, ఇరాన్ లీడర్‌ షిప్‌కు కీలకమైన మెసేజ్ పంపుతున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని కోరారు. ఇరాన్, ఇజ్రాయెల్‌తో మాట్లాడి ట్రంప్ యుద్ధాన్ని ఆపాలని తెలిపారు. ట్రంప్ వైట్‌హౌస్ పవర్ ఉపయోగించడం లేదని చెప్పారు. ఇవాళ(శనివారం) ఢిల్లీ వేదికగా మీడియాతో కేఏ పాల్ మాట్లాడారు. ట్రంప్ మనసు మారాలని అన్నారు. ట్రంప్ అగ్గి పెడుతున్నాడని, మళ్లీ శాంతి అని మాట్లాడుతున్నారని తెలిపారు. ట్రంప్ అనుకుంటే ఒక్క ఫోన్ కాల్‌తో యుద్ధం ఆపగలరని చెప్పుకొచ్చారు కేఏ పాల్.


ఇజ్రాయెల్ - ఇరాన్ వార్ వల్ల ఎన్నో దేశాలు ప్రభావితం అవుతున్నాయని కేఏ పాల్ వెల్లడించారు. ప్రపంచం మొత్తం ఆ యుద్ధం ఆపాలని కోరుకుంటుందని అన్నారు. ఇలా దేశాల మధ్య యుద్ధాలు ఇంకెన్నాళ్లు, ఎంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉండాలని ప్రశ్నించారు. ప్రపంచ పెద్దలు ఏం చేస్తున్నారని అడిగారు. శాంతి కోసం అందరూ ప్రయత్నించాలని అన్నారు. రాజకీయ నాయకులు ఎప్పుడు శాంతిని కోరుకోవడం లేదని కేఏ పాల్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కూర్పు మనది.. లాభాలు చైనావి.. మేక్ ఇన్ ఇండియాపై రాహుల్ విసుర్లు

సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించం...తేల్చిచెప్పిన అమిత్‌షా

For National News And Telugu News

Updated Date - Jun 21 , 2025 | 08:07 PM