Share News

India US Trade Deal: విధి విధానాలు సిద్ధం

ABN , Publish Date - Apr 23 , 2025 | 03:17 AM

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమమవుతుండగా, మోదీ ప్రజాదరణపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రశంసలు కురిపించారు. భారత్‌ అణుశక్తి లక్ష్యాల సాధనలో అమెరికా భాగస్వామిగా నిలుస్తుందని స్పష్టం చేశారు

India US Trade Deal: విధి విధానాలు సిద్ధం

  • వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమం.. మోదీ ప్రజాదరణ అసూయ కలిగిస్తోంది

  • అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: వాణిజ్య సంప్రదింపులకు సంబంధించి భారత్‌-అమెరికాలు విధివిధానాలు అధికారికంగా ఖరారు చేశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వెల్లడించారు. దాంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమమైందని అన్నారు. మంగళవారం ఆయన జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. భారత్‌ అణు ఇంధన లక్ష్యాలు నెరవేర్చడానికి అమెరికా ఉపయోగపడుతుందని అన్నారు. భారత ప్రధాని మోదీ ప్రజాదరణ స్థాయి చూస్తుంటే తనకు అసూయగా ఉందని వాన్స్‌ వ్యాఖ్యానించారు. ఇదే విషయం ఆయనకు సోమవారం విందు సందర్భంగా ఆయనకు స్వయంగా చెప్పానన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రజాస్వామిక దేశాధినేత అయిన మోదీని బైడెన్‌ ప్రభుత్వం తరచూ విమర్శించేదని వాన్స్‌ ప్రస్తావించారు. బైడెన్‌ ప్రభుత్వం భారత్‌ను కారుచౌకగా శ్రామిక శక్తి లభించే దేశంగా మాత్రమే చూసిందని వ్యాఖ్యానించారు. అక్షరధామ్‌ ఆలయాన్ని కుటుంబంతో కలిసి చూడటం తన అదృష్టమని వాన్స్‌ అన్నారు. భారత్‌కు పురాతన శిల్ప సంపద అందాలు, గొప్ప చరిత్రతో పాటు భవిష్యత్తు పట్ల స్పష్టత కూడా ఉన్నాయని కొనియాడారు. ప్రపంచంలో చాలా దేశాలు తిరిగానని, అన్నిచోట్ల అనుకరణ తాపత్రయం ఉండేదని, భారతదేశంలో మాత్రమే అది కనబడలేదని వ్యాఖ్యానించారు. భారతీయుడని చెప్పుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. తన పిల్లలు మోదీని ఎంతో ఇష్టపడ్డారని వాన్స్‌ చెప్పారు.


ఎగుమతిదార్లకు ఊరట

వాన్స్‌ ప్రకటన భారతదేశ ఎగుమతిదారులకు గొప్ప ఊరటనిస్తుందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. కొత్త ట్యారిఫ్‌ విధానానికి ట్రంప్‌ 90 రోజుల విరామం ప్రకటించిన నేపథ్యంలో గడువు ముగిసిన తర్వాత పరిస్థితిపై పరిశ్రమల వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం జేడీ వాన్స్‌, ఉష దంపతులు ముగ్గురు పిల్లలతో కలిసి ఉదయాన్నే జైపూర్‌లోని అంబర్‌ ఫోర్టును సందర్శించారు. అక్కడ రెండు గంటలు గడిపారు.


ఇవి కూడా చదవండి

జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో..

Gold Rate History: 2000 నుంచి 2025 వరకు బంగారం ధరల్లో ఎంత మార్పు..

Updated Date - Apr 23 , 2025 | 03:17 AM