Narayanan ISRO Chief: LVM3 సిరీస్‌లో ఇది 8వ విజయం: ఇస్రో ఛైర్మన్ నారాయణన్
ABN , Publish Date - Nov 02 , 2025 | 06:20 PM
'ఎల్‌వీఎం3-ఎం5' రాకెట్ CMS-05 శాటిలైట్ ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ఇది ఎల్ వీఎం సిరీస్ లో 8వ విజయమని పేర్కొన్నారు. గతంలో చంద్రయాన్ - 3 ప్రయోగంలో LVM3 రాకెట్ విజయవంతంగా చంద్రుడి సౌత్ పోల్ పై ల్యాండర్, రోవర్ ని దింపిందని గుర్తు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం కీలక రాకెట్ ప్రయోగం చేపట్టింది. ‘సీఎంఎస్-03’ ఉపగ్రహంతో కూడిన ‘ఎల్‌వీఎం3-ఎం5’ (LVM3 M5) వాహక నౌక శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్( ISRO launch)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం బరువు 4,410 కిలోలు. దీన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీవో)లోకి ప్రవేశపెట్టింది. భారత భూభాగం నుంచి ఈ కక్ష్యలోకి ప్రయోగించిన శాటిలైట్లన్నింటిలోకీ ఇదే అత్యంత బరువైనది. ఈ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ నారాయణన్ కీలక కామెంట్స్ చేశారు.
'ఎల్‌వీఎం3-ఎం5' రాకెట్ CMS-05 శాటిలైట్ ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్( Narayanan ISRO Chief) తెలిపారు. ఇది ఎల్ వీఎం సిరీస్ లో 8వ విజయం అని వెల్లడించారు. గతంలో చంద్రయాన్ - 3 ప్రయోగంలో LVM3 రాకెట్ విజయవంతంగా చంద్రుడి సౌత్ పోల్ పై ల్యాండర్, రోవర్ ని దింపిందని గుర్తు చేశారు. ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేసిన ఇస్రో ఫ్యామిలీ మొత్తానికి అభినందనలు అంటూ, అందరూ ఐకమత్యంగా, లక్ష్యంతో పనిచేశారని అభినందించారు. బాహుబలి రాకెట్ ద్వారా మరెన్నో శాటిలైట్లని నింగికి పంపే వీలుందని, మొదటిసారి క్రియోజనిక్ ఇంజన్ లో రీఇగ్నైట్ విజయవంతంగా జరిగిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు.
ఇక సీఎంఎస్-03 ఉపగ్రహం విషయానికి వస్తే.. దీని ద్వారా సమాచార వ్యవస్థ మెరుగు పడటంతోపాటు సముద్ర వాతావరణ( Indian Space) పరిస్థితులను తెలుసుకోవచ్చు. ప్రధానంగా భారత నౌకాదళం కోసం దీన్ని రూపొందించారు. కడలిలో మోహరించిన మన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, భూ నియంత్రణ కేంద్రాలతో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ శాటిలైట్ తోడ్పాటు అందిస్తుంది. భారత తీరం నుంచి 2000 కిలోమీటర్ల దూరం వరకూ విస్తరించిన సాగర జలాల్లో సేవలు అందించగలదు. దీన్ని జీశాట్-7ఆర్ అని కూడా పిలుస్తారు. జీశాట్-7 స్థానంలో దీన్ని ప్రయోగించారు.
ఇవి కూడా చదవండి
లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు