Share News

Kerala: కేరళ కమనీయం.. అత్యంత పేదరికాన్ని రూపుమాపిన రాష్ట్రంగా రికార్డు

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:21 PM

దేశంలో వంద శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచిన కేరళ మరో ఖ్యాతి దక్కించుకుంది. భారతదేశంలో దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది.

Kerala: కేరళ కమనీయం.. అత్యంత పేదరికాన్ని రూపుమాపిన రాష్ట్రంగా రికార్డు

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో వంద శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచిన కేరళ మరో ఖ్యాతి దక్కించుకుంది. భారతదేశంలో దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. శనివారం కేరళ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.


'దుర్భర పేదరికం లేని తొలి రాష్ట్రంగా కేరళను మార్చడంలో విజయం సాధించాం'అని CM విజయన్‌ పేర్కొన్నారు. పేదల కోసం 5,400కు పైగా ఇళ్లు మంజూరు చేశామని, ఇవి పూర్తి, నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. 5,522 ఇళ్లకు మరమ్మతులు చేయించామని, ఇళ్ల స్థలాలు లేని 2,713 మంది పేదలకు స్థలాలు కేటాయించామని వెల్లడించారు.


21,263 మందికి కొత్తగా రేషన్‌, ఆధార్‌ కార్డులు, పింఛన్‌ మంజూరు చేశామని సీఎం తెలిపారు. కాగా విజయన్‌ ప్రకటనను కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్‌ తప్పుపట్టింది. దుర్భర పేదరికాన్ని నిర్మూలించామన్న ప్రకటన 'పచ్చి మోసం' అని ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి

Indias Heaviest Communication Satellite: ఇస్రో భారీ ప్రయోగం

Updated Date - Nov 02 , 2025 | 12:23 PM