Heavy Rainfall: ఐఎండీ అలర్ట్.. ఆగస్టు 9 వరకు ఈ రాష్టాల్లో భారీ వర్షాలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 07:30 AM
దేశంలో వర్షాలు మళ్లీ అందరిని తడిపేందుకు సిద్ధమయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం, ఈశాన్య భారత్ సహా పలు ప్రాంతాల్లో వచ్చే నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దేశంలో వర్షాల (Rains) జోరు మళ్లీ మొదలైంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా సమాచారం ప్రకారం, ఈశాన్య భారతదేశంతో పాటు అనేక రాష్ట్రాల్లో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురియనున్నాయి. కేరళ, తమిళనాడులో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఆగస్టు 6-9 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్లో.. అస్సాం, మేఘాలయలో ఆగస్టు 4, 7-9 మధ్య భారీ వర్షాలు ఉంటాయి.
ఈ ప్రాంతాల్లో కూడా..
ఉత్తరాఖండ్లో ఆగస్టు 3-5 వరకు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఆగస్టు 4న, హిమాచల్ ప్రదేశ్లో ఆగస్టు 4,5 తేదీల్లో వర్షాలు ఉంటాయి. హర్యానా, యూపీ, బీహార్, కేరళ, కర్ణాటక వంటి ఇతర ప్రాంతాలలో కూడా ఈ సమయంలో వానలు ఉంటాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది.
తెలుగు రాష్టాల్లో..
ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఈరోజు నుంచి వచ్చే మూడు, నాలుగు రోజులు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా( AP Rains), రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు తెలంగాణలో (Telangana Rains) ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్కువ వర్షాల ప్రభావం ఉంటుందని వెల్లడించింది.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
గడిచిన 24 గంటల్లో అస్సాం, మేఘాలయలలో ఒక్కో చోట 21 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, బీహార్, కేరళ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. హిమాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, ఒడిశా, కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇక జాతీయ రాజధాని ఢిల్లీ విషయానికొస్తే, వచ్చే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి