Sonia Gandhi: సోనియా వ్యాఖ్యలను తప్పుపట్టిన రాష్ట్రపతి భవన్
ABN , Publish Date - Jan 31 , 2025 | 06:02 PM
దేశ అత్యున్నత కార్యాలయం హోదాను తగ్గించేలా సోనియాగాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆ మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పార్లమెంటు సమావేశాలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఇప్పటికే డిమాండ్ చేయగా, ఆ తర్వాత కొద్ది సేపటికే రాష్ట్రపతి భవన్ కార్యాలయం సైతం ఒక ప్రకటన విడుదల చేసింది. సోనియా గాంధీ వ్యాఖ్యలు 'పేలవంగా' (Poor Taste) ఉన్నాయని తప్పుపట్టింది. అత్యున్నత పదవిలో ఉన్న వారి హోదాను కించపరచేలా ఉన్నాయని తెలిపింది.
Budget session: రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించిన సోనియా.. బీజేపీ మండిపాటు
''ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి అలగిసిపోయారని, మాట్లాడలేకపోయారని కొందరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మాట్లాడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. చాలా స్పష్టంగా దేశ అత్యున్నత కార్యాలయం హోదాను తగ్గించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. వారి మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. ప్రసంగం చివరి వరకూ రాష్ట్రపతి ఎక్కడా అలసిపోలేదు. నిజానికి అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి అలసటను దగ్గరకు రానీయరానిది రాష్ట్రపతి బలంగా నమ్ముతారు'' అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. బహుశా హిందీ వంటి భారతీయ భాషల్లో ప్రసంగాలు, నుడికారాల గురించి పరిచయం లేకపోవడం వల్ల కాంగ్రెస్ నాయకులు దానిని సరిగా అర్ధం చేసుకుని ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ఏది ఏమైనప్పటికీ ఈ తరహా వ్యాఖ్యలు వ్యక్తుల ఉత్తమాభిరుచికి ఏమాత్రం అద్దం పట్టవని, దురదృష్టకరమని, వీటికి దూరంగా ఉండటమే మంచిదని ఆ ప్రకటన పేర్కొంది.
సోనియాగాంధీ ఏమన్నారు?
రాష్ట్రపతి ప్రసంగంపై సోనియాగాంధీ పార్లమెంటు వెలుపల తన స్పందన తెలియజేశారు. ''ప్రసంగం చివర్లో రాష్ట్రపతి బాగా అలసిపోయారు. మాట్లాడలేకయారు. పూర్ థింగ్'' అని వ్యాఖ్యానించారు. సోనియా వ్యాఖ్యలను బీజేపీ తప్పుపడుతూ, ఈ తరహా వ్యాఖ్యలు వారి మైండ్‌సెట్‌ను సూచిస్తాయని, రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలని అన్నారు.
ఇవి కూడా చదవండి
PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్
Parliament: శీతాకాల సభల్లో సెగలే!
Read Latest National News And Telugu News