Ayodhya: అయోధ్య ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి ఆందోళనకరం
ABN , Publish Date - Feb 03 , 2025 | 07:00 PM
ఎనభై ఐదేళ్ల సత్యేంద్ర దాస్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం ఆదివారంనాడు ఎస్‌జీపీజీఐ ఆసుపత్రికి తరలించారు. మధుమేహం, హైపర్‌టెన్సివ్‌తో ఆయన బాధపడుతున్నారని, ప్రస్తుతం న్యూరాలజీ వార్డ్ హెచ్‌డీయూ (హై డెపెన్డెన్సీ యూనిట్)లో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

లక్నో: అయోధ్యలోని రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ (Acharya Satyendra Das) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ (Brain stroke) రావడంతో సంజయ్‌గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఐ)లో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు సోమవారంనాడు తెలిపారు.
Jai Shankar: నా అమెరికా పర్యటనపై రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం: జైశంకర్
ఎనభై ఐదేళ్ల సత్యేంద్ర దాస్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం ఆదివారంనాడు ఎస్‌జీపీజీఐ ఆసుపత్రికి తరలించారు. మధుమేహం, హైపర్‌టెన్సివ్‌తో ఆయన బాధపడుతున్నారని, ప్రస్తుతం న్యూరాలజీ వార్డ్ హెచ్‌డీయూ (హై డెపెన్డెన్సీ యూనిట్)లో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ఆయన ప్రధాన అవయవాలన్నీ స్పందిస్తున్నాయని, వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని తెలిపింది.
Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్!
Cancer in India: దేశానికి క్యాన్సర్ సవాల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి