Share News

Nimisha Priya: నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదు.. కేంద్రం క్లారిటీ..

ABN , Publish Date - Jul 29 , 2025 | 10:17 AM

కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. యెమెన్ (Yemen) ప్రభుత్వం నిమిష ఉరిశిక్ష రద్దుకు అంగీకరించిందని వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం అవాస్తవమంటూ తోసిపుచ్చింది.

Nimisha Priya: నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదు.. కేంద్రం క్లారిటీ..
Indian Govt Denies Nimisha Death Sentence

కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. యెమెన్ (Yemen) ప్రభుత్వం నిమిష ఉరిశిక్ష రద్దుకు అంగీకరించిందని.. ఆమెకు ఊరట లభించినట్లేన వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇవన్నీ అవాస్తవమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కాగా, భారత గ్రాండ్‌ ముఫ్తీ, సున్నీ లీడర్‌ కాంతపురం ఏపీ అబూబకర్‌ కార్యాలయం నిమిష ఉరిశిక్ష రద్దయినట్లు ప్రకటనను విడుదల చేసింది. యెమెన్ అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో పలువురు మత పండితులు జరిపిన చర్చలు ఫలించినట్లు ప్రకటనలో పేర్కొంది.


నిమిష ప్రియ మరణశిక్ష రద్దయినట్లు విస్తృతంగా ప్రచారమవుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని తోసిపుచ్చింది. కేరళ నర్సు ఉరిశిక్షను రద్దుపై యెమెన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని స్పష్టం చేసింది.


కాగా, యెమెన్ పౌరుడి హత్య కేసులో జులై 16నే నిమిషకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా.. ప్రభుత్వ అధికారులు, మత పెద్దల జోక్యంతో వాయిదా పడింది. ఆమె విడుదల కోసం ఇప్పటికీ బాధిత కుటుంబం, యెమెన్ అధికారులతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, మృతుడు తలాల్ అబ్జో మెహదీ కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెపుతోంది. దీంతో, ఇక మున్ముందు నిమిష కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 10:40 AM