Fire Accident: ముంబై ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..
ABN , Publish Date - Apr 27 , 2025 | 09:42 AM
Fire Accident At Mumbai ED Office: ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలా జరిగిందంటే..

Fire Accident At Mumbai ED Office: దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ప్రాంతంలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయ భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కుర్రింబోయ్ రోడ్డులో ఉన్న కైసర్-ఐ-హింద్ భవనంలోని ఈడీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి 12 అగ్నిమాపక దళాలు చేరుకున్నాయి. అయితే మంటల్లో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారిక వర్గాల సమాచారం.
ఐదు అంతస్తులున్న కైజర్-ఐ-హింద్ భవనంలో ఈడీ కార్యాలయం ఉంది. ఆదివారం తెల్లవారుజామున దాదాపు 2.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగి దట్టమైన నల్లటి పొగలు వెలువడ్డాయి. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన అగ్నిమాపక బృందాలు అక్కడకు చేరుకుని 3.30 గంటల్లోగా మంటలను ఆర్పి వేశారు. మంటలు నాల్గవ అంతస్తుకే పరిమితయ్యాయని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ముంబై అగ్నిమాపక శాఖ తెలిపింది. ఇది లెవెల్-II అగ్నిప్రమాదమని ధృవీకరించింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.
Read Also: Mohan Bhagwat: రాక్షసత్వం ప్రబలితే.. పహల్గాం దాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ రియాక్షన్
National Commissions: సమస్యల సుడిలో కమిషన్లు