Share News

EPS: బై.. బై.. స్టాలిన్‌.. మిమ్మల్ని ప్రజలే ఇంటికి సాగనంపుతారు

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:49 AM

రాష్ట్రంలో గత నాలుగేళ్ళకు పైగా కొనసాగుతున్న ప్రజావ్యతిరేక డీఎంకే ప్రభుత్వాన్ని మరో 9 నెలల్లో ప్రజలే ఇంటికి సాగనంపుతారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో ఈ నెల 7వ తేదీన ప్రారంభించిన తొలి ప్రచారయాత్ర బుధవారం తంజావూరు జిల్లా వరత్తనాడులో ముగిసింది.

EPS: బై.. బై.. స్టాలిన్‌.. మిమ్మల్ని ప్రజలే ఇంటికి సాగనంపుతారు

- తంజావూరు ప్రచారంలో గర్జించిన ఈపీఎస్‌

చెన్నై: రాష్ట్రంలో గత నాలుగేళ్ళకు పైగా కొనసాగుతున్న ప్రజావ్యతిరేక డీఎంకే ప్రభుత్వాన్ని మరో 9 నెలల్లో ప్రజలే ఇంటికి సాగనంపుతారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో ఈ నెల 7వ తేదీన ప్రారంభించిన తొలి ప్రచారయాత్ర బుధవారం తంజావూరు జిల్లా వరత్తనాడులో ముగిసింది. ఉదయం 9.30 గంటల నుంచి ఈపీఎస్‌ ఆ ప్రాంతంలోని రైతులు, వ్యాపారులు, కులవృత్తుల సంఘాల నేతలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


అన్నాడీఎంకే రైతు సంఘం తరుఫున కానుకగా సమర్పించిన నాగలి స్వీకరించారు. సాయంత్రం జరిగిన బహిరంగ సభలో కార్యకర్తలు బహూకరించిన టోపీ ధరించి ప్రసంగించారు. వరి సాగుకు పేరొందిన తంజావూరు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఓ రైతుగా తెలుసుకున్నానని, ఉత్పత్తి అధికంగావున్న సమయంలో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు కలిసి వరిపంటకు గిట్టుబాటు ధర నిర్ణయించాలని, అయితే డీఎంకే ప్రభుత్వం ఈ వ్యవహారంలో కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి అన్నదాతలకు న్యాయం చేయలేక చతికిలబడిందని విమర్శించారు.


వచ్చే ఏడాది అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ప్రజల అండదండలతో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారం చేపడుతుందని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. కేంద్రప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి చెందాల్సిన అభివృద్ధి పథకాల నిధులను సకాలంలో పొందడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులుగా పొడిగిస్తామని వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా గృహిణులకు చౌకదుకాణాల ద్వారా నాణ్యమైన చీర కానుకగా అందజేస్తామన్నారు.


nani1.jpg

234 నియోజకవర్గాల్లో 210 స్థానాల్లో అన్నాడీఎంకే కూటమి ఘనవిజయం సాధిస్తుందని ఈపీఎస్‌ ధీమా వ్యక్తంచేశారు. దివగత మాజీముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలిత కన్నకలలు తప్పకుండా నెరవేరే రోజులు ముందున్నాయన్నారు. డీఎంకే కూటమిలో ఉన్న పార్టీలలో ఏకాభిప్రాయం లేనందువల్ల రాష్ట్రప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని విమర్శించారు.


జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామ్యం వహించిన ఆమ్‌ ఆద్మీ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు కూటమి నుంచి బయటికొచ్చాయని, మరి కొన్ని రోజుల్లో పలు పార్టీలు కూడా వైదొలిగే పరిస్థితి కనిపిస్తుందన్నారు. దేశంలో ఏ పార్టీ కూడా ఇంటింటికీ వెళ్ళి పార్టీ సభ్యత్వం చేపట్టిన దాఖలాలు లేవని, అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామేమోనన్న భయంతోనే డీఎంకే చట్టవిరుద్ధంగా పార్టీ సభ్యత్వం పేరుతో ఇంటింటికి వెళ్ళి ప్రజలను ఓటీపీ అడిగడంపై న్యాయస్థానం మందలించిందని ఈపీఎస్‌ ఎద్దేవాచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

2 నెలల్లో ఓఆర్‌ఆర్‌ ఆర్థిక ప్రతిపాదనలు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 24 , 2025 | 11:49 AM