Share News

Siddaramaiah: ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ప్రస్తావనెందుకు? కస్సుమన్న సిద్ధరామయ్య

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:35 PM

మైసూరులో శనివారంనాడు ఏర్పాటు చేసిన సాధానా సమావేశంలో ప్రభుత్వం సాధించిన విజయాలను సిద్ధరామయ్య ప్రస్తావించారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. డీకే శివకుమార్‌తో పాటు పలువురు కీలక నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు.

Siddaramaiah: ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ప్రస్తావనెందుకు? కస్సుమన్న సిద్ధరామయ్య

బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుండగా, ఐదేళ్లూ తానే సీఎం అంటూ సిద్ధరామయ్య ప్రకటించుకోవడం, అధిష్టానం చెప్పినది చేయడం మినహా తనకు మరో గత్యంతరం లేదంటూ డీకే చెప్పడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా మరో ఆసక్తికర పరిణామం ప్రభుత్వ కార్యక్రమంలో చేటుచేసుకుంది. వేదకపై డీకే శివకుమార్ పేరు ప్రస్తావించాలని సూచించిన వ్యక్తిపై సిద్ధారామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ లేని వ్యక్తుల గురించి ప్రస్తావించడం ఏమిటంటూ అసంతృప్తి వ్యక్తం చేసారు.


మైసూరులో శనివారంనాడు ఏర్పాటు చేసిన సాధానా సమావేశంలో ప్రభుత్వం సాధించిన విజయాలను సిద్ధరామయ్య ప్రస్తావించారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. డీకే శివకుమార్‌తో పాటు పలువురు కీలక నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. తొలుత డీకే ప్రసంగం పూర్తి చేసుకుని తనకు ముఖ్యమైన పని ఉందంటూ బెంగుళూరు వెళ్లిపోయారు. అనంతరం సీఎం ప్రసంగించేందుకు పోడియం వద్దకు వచ్చారు. వేదికపై ఉన్న వారి పేర్లను ఆయన ప్రస్తావిస్తూ డీకే పేరు చెప్పలేదు. దీంతో పార్టీ కార్యకర్త ఒకరు ఈ విషయాన్ని గుర్తుచేశారు. దీంతో సీఎం అసహనం వ్యక్తం చేశారు.


'డీకే ఇక్కడ లేరు. ఆయన బెంగళూరు వెళ్లిపోయారు. మీరు వేదికపై ఉన్న వారి పేర్లు చెప్పమన్నారు, వెళ్లిపోయిన వాళ్ల పేర్లు కాదు. ఇక్కడున్న వారిని ఆహ్వానించడం ప్రోటోకాల్. ఇంట్లో కూర్చున్న వాళ్ల గురించి కాదు. మీ అడ్వకేట్లు ఆ విషయాన్ని అర్ధం చేసుకోవాలి' అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

దేశం విషయంలో రాజకీయ వైరాలు అడ్డుకారాదు: శశిథరూర్

విమాన ప్రమాదం.. యూఎస్ మీడియా కథనంపై ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ ఆగ్రహం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 04:38 PM