Air India Plane Crash: విమాన ప్రమాదం.. యూఎస్ మీడియా కథనంపై ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ ఆగ్రహం
ABN , Publish Date - Jul 20 , 2025 | 10:40 AM
Air India Plane Crash: వాల్ స్ట్రీట్ జర్నల్ కథనానికి .. ప్రమాదానికి మధ్య లెక్కలు సరిపోవటం లేదని ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ క్యాప్టన్ ఈషన్ ఖలీద్ అన్నారు. ఒక సెకన్ తేడా మీడియా ప్రచారం తప్పని తేలుస్తుందన్నారు. ఆయన ఓ జాతీయ మీడియాతో పలు కీలక విషయాలు చెప్పారు.

ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమాన ప్రమాదంపై అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం రాసిన సంగతి తెలిసిందే. సీనియర్ పైలట్ కారణంగానే ప్రమాదం జరిగిందని రాసింది. ఆయనే ఫ్యూయల్ స్విచ్‌లు ఆపేశాడని బాంబు పేల్చింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ క్యాప్టన్ ఈషన్ ఖలీద్ తప్పుబట్టారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనానికి .. ప్రమాదానికి మధ్య లెక్కలు సరిపోవటం లేదని అన్నారు. ఒక సెకన్ తేడా మీడియా ప్రచారం తప్పని తేలుస్తుందన్నారు. ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..
‘విమాన ప్రమాదంపై జరుగుతున్న ప్రచారాన్ని తుడిచిపెట్టే ఓ లెక్క చెబుతాను. మొత్తం ప్రమాదం 42 సెకన్లలో జరిగింది. కేవలం ఒకే ఒక సెకన్ తేడాతో రెండు ఫ్యూయల్ స్విచ్‌లు ఆఫ్ అయ్యాయి. అలా చేయాలంటే కాక్‌పిట్‌లో కూర్చున్న మనిషి అత్యంత వేగంగా తన చేతి వేళ్లను కదిలించాలి. కేవలం 500 మిల్లీ సెకన్లలో రెండిటిని ఆఫ్ చేయాలి. అప్పుడే రెండు కూడా ఒకే సెకన్‌లో ఆఫ్ అవుతాయి. ప్రచారంలో ఉన్న దాని ప్రకారం.. ఫ్యూయల్ స్విచ్‌లు ఎందుకు ఆపావని ఓ పైలట్ అడిగాడు.
ఇంకో పైలట్ తనకు తెలీదని అన్నాడు. ఒక వేళ పైలట్ ఫ్యూయల్ స్విచ్‌లు ఆఫ్ చేసి ఉంటే.. తిరిగి వాటిని ఆన్ చేయడానికి 10 సెకన్లు ఎందుకు టైం తీసుకున్నాడు. ఒక వేళ ఓ పైలట్ చావడానికి వాటిని ఆఫ్ చేసి ఉంటే.. బతకాలనుకున్న మరో పైలట్ ఎందుకు వాటిని అత్యంత వేగంగా ఆన్ చేయలేకపోయాడు. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కారణంగా ఫ్యూయల్ ఆగిపోయి ఉంటుంది. అందుకే అవి మళ్లీ యథాస్థానానికి రాలేదు. అందుకే విమానాన్ని మళ్లీ రీస్టార్ట్ చేయాలని చూశారు. కానీ, కుదరలేదు. ప్రమాదం జరిగింది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు
ఏఐ అద్భుతం.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే..