Delhi Assembly Elections: ఆప్‌కు షాక్.. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా
ABN , Publish Date - Jan 31 , 2025 | 07:15 PM
టిక్కెట్లు ఇవ్వకపోవడం, పార్టీలో అంతర్గత పరిస్థితులపై అసంతప్తి వంటి కారణాలు ఎమ్మెల్యేల రాజీనామాకు దారితీసినట్టు ప్రచారం జరుగుతుండగా, వీరి తదుపరి చర్యపై కూడా చర్చ జరుగుతోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యే మాత్రం వేరే పార్టీలో చేరే అవకాశాలపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటన లేదు.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గట్టిదెబ్బ తగిలింది. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి శుక్రవారంనాడు రాజీనామా చేశారు. మరో ఐదు రోజుల్లో (ఫిబ్రవరి 5) పోలింగ్ ముంచుకొస్తున్న తరుణంలో ఎమ్మెల్యేల రాజీనామా ఆ పార్టీలో అసంతృప్తి పెరిగిందనే సంకేతాలకు తావిస్తోందని అంటున్నారు.
Delhi Elections: ఆప్ పథకాలతో ఒక్కో కుటుంబానికి రూ.25,000 సేవింగ్
పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో భావనా గౌర్ (పాలం), రాజేష్ రిషి (జనక్‌పురి), మదన్‌లాల్ (కస్తూర్బా నగర్), రోహిత్ కుమార్ మెహ్రౌలియా (త్రిలోక్‌పురి), భూపిందర్ సింగ్ జూన్ (బిజ్వాసన్), నరేష్ యాదవ్ (హెహ్రౌలి) పవన్ కుమార్ శర్మ (ఆదర్శ్ నగర్) ఉన్నారు. నరేష్ యాదవ్ శుక్రవారంఉదయం తన రాజీనామాను ప్రకటించడంలో పార్టీలో అంతర్గత కలహాలు ముదిరినట్టు ఊహాగానాలు మొదలయ్యారు. అయితే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం పార్టీకి గట్టిదెబ్బగా అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం అరవింద్ కేజ్రీవాల్‌కు గట్టి సవాలు కావచ్చని చెబుతున్నారు.
ఎమ్మెల్యేల తదుపరి చర్య ఏమిటి?
అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకపోవడం, పార్టీలో అంతర్గత పరిస్థితులపై అసంతప్తి వంటి కారణాలు ఎమ్మెల్యేల రాజీనామాకు దారితీసినట్టు ప్రచారం జరుగుతుండగా, వీరి తదుపరి చర్యపై కూడా చర్చ జరుగుతోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మాత్రం వేరే పార్టీలో చేరే అవకాశాలపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపు, ఎమ్మెల్యేల సామూహిక రాజీనామాపై ఆప్ సైతం అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, సామూహిక రాజీనామాలతో కీలక నియోజకవర్గాల్లో ఆప్ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్
Parliament: శీతాకాల సభల్లో సెగలే!
Read Latest National News And Telugu News