Share News

Maharashtra Minister Resigns: సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

ABN , Publish Date - Mar 04 , 2025 | 05:03 PM

అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మంత్రి రాజీనామా వ్యవహారాన్ని సభ మందుకు తీసుకురావాల్సి ఉండగా సీఎం అందుకు భిన్నంగా వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపించింది. రాజీనామాపై సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు సభ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపింది.

Maharashtra Minister Resigns: సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnais)పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు (Privilege Motion) ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు తెలిపింది. మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే (Dhanjay Munde) రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మంత్రి రాజీనామా వ్యవహారాన్ని సభ మందుకు తీసుకురావాల్సి ఉండగా సీఎం అందుకు భిన్నంగా వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపించింది. రాజీనామాపై సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు సభ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందని, అలాకాకుండా మీడియా ముందు మంత్రి రాజీనామాపై ప్రకటన చేయడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది.

Maharashtra Minister Resigns: మహారాష్ట్రలో సర్పంచ్ హత్య కేసు కలకలం.. మంత్రి రాజీనామా


బీడ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో ధనంజయ్ ముండే సన్నిహితుడు వాల్మీక్ కరద్ పేరు చేర్చడంతో మంత్రి మంగళవారంనాడు తన రాజీనామాను సమర్పించారు. ఆయన రాజీనామాను వెంటనే సీఎం ఆమోదించారు. ఈ విషయాన్ని దేవేంద్ర ఫడ్నవిస్ మీడియాకు వెల్లడించారు. ధనంజయ్ ముండే రాజీనామాను అంగీకరించి తదుపరి చర్యల కోసం గవర్నర్‌కు పంపినట్టు చెప్పారు.


బీడ్ జిల్లా పార్లి నియోజకవర్గానికి ఎన్‌సీపీ ఎమ్మెల్యేగా ముండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫడ్నవిస్ ప్రభుత్వంలో ఫుడ్ అండ్ సప్లయిస్ మంత్రిగా ఉన్నారు. ఇంతకుముందు ఆయన బీడ్ గార్డియన్ మినిస్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం పుణెతో పాటు బీడ్ జిల్లా గార్డియన్ మంత్రిగా ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ ఉన్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, దేవేంద్ర ఫడ్నవిస్‌ను అజిత్ పవార్ సోమవారం రాత్రి కలుసుకున్నారు. దేశ్‌ముఖ్ హత్య కేసులో కరద్‌పై సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేయడం, మరో రెండు కేసుల్లోనూ ఆయన ప్రమేయం ఉన్న విషయాన్ని అజిత్ పవార్ సీఎం దృష్టికి తెచ్చారు. ఈ క్రమలో ధనంజయ్ ముండేను రాజీనామా చేయాల్సిందిగా ఫడ్నవిస్ కోరినట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్

Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు

Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..

Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2025 | 05:08 PM