Home » Notice
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు మాదాపూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్బంగా మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ.. మాదాపూర్ పోలీసులు తన ఫోన్‌ను సీజ్ చేశారని, ఇప్పటికీ అది వారి వద్దే ఉందని తెలిపారు.
హైదరాబాద్: టాలీవుడ్ సినీ హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27న విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
స్థిరాస్తుల జప్తునకు సంబంధించి మూడు ప్రాంతాల్లో నోటీసులు అతికించినట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఐటీవోలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ఏరియాలోని ప్రాంగణంలో, లక్నోలోని బిషేశ్వర్ నాథ్ రోడ్డులో ఉన్న ఏజేఎల్ బిల్డింగ్ వద్ద ఈ నోటీసులు అతికించినట్టు పేర్కొంది.
ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు సమర్ధించింది. దీనిని బహిరంగంగా మమతా బెనర్జీ సవాలు చేశారు.
వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన జగన్ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి సిట్ మూడోసారి నోటీసు జారీ చేసింది. మద్యం షాపులకు సరఫరా, లంచాల నెట్వర్క్ నిర్వహణలో కీలకంగా ఉన్నాడని ఆధారాలు లభించాయి. దీంతో బుధవారం విచారణకు రావాలంటూ సెట్ అధికారులు నోటీసు ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం విచారణకు హాజరు కావాలంటూ మీడియా సంస్థల ఎండి శ్రవణ్‌రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన నోటీసులను శ్రవణ్‌రావు కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు అందజేశారు.
కునాల్‌పై కేసు నమోదు కావడంతో దర్యాప్తులో భాగంగా నోటీసులు పంపినట్టు పోలీసులు ధ్రువీకరించారు. అయితే మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. 36 ఏళ్ల కునాల్ ఇటీవల జరిగిన ఒక షోలో షిండే రాజకీయ ప్రయాణంపై సెటైర్లు విసిరారు.
ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలంటూ మాదాపూర్‌లో ఉంటున్న ఆయన ఇంటికి పోలీసులు ఈ మేరకు నోటిసులు అంటించారు.
ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు ఇస్తూ, ఎన్ఈపీపై డీఎంకే ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్‌కు నిధులను ఎన్ఈపీ అమలుతో కేంద్రం ముడిపెట్టరాదని, ఈ విషయంలో తమ (డీఎంకే) వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మంత్రి రాజీనామా వ్యవహారాన్ని సభ మందుకు తీసుకురావాల్సి ఉండగా సీఎం అందుకు భిన్నంగా వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపించింది. రాజీనామాపై సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు సభ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపింది.