Share News

Car Race: స్నేహితుడితో కలిసి కార్ రేస్.. అతి వేగంగా వెళ్తూ..

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:50 AM

హర్ష్‌రాజ్ సింగ్ గోహిల్ అనే 20 ఏళ్ల యువకుడు.. తన స్నేహితుడితో కలిసి కలియాబీడ్ ప్రాంతంలోని రద్దీగా ఉండే రోడ్డుపై కారు రేస్ స్టార్ట్ చేశాడు. హర్ష్‌రాజ్ సింగ్ క్రెటా కారులో వెళ్తుండగా.. అతడి స్నేహితుడు ఎరుపు రంగు బ్రెజ్జా కారులో రేస్‌కు సిద్ధమయ్యారు. అయితే ఈ క్రమంలో..

Car Race:  స్నేహితుడితో కలిసి కార్ రేస్.. అతి వేగంగా వెళ్తూ..

పోలీసు కుమారుడైన యువకుడు.. తన స్నేహితుడితో కలిసి రద్దీ రోడ్డుపై కారు రేస్ పెట్టాడు. అత్యంత వేగంగా కారు నడుపుతూ ఇద్దరు పాదచారులను ఢీకొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు.


గుజరాత్‌లోని (Gujarat) భావ్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హర్ష్‌రాజ్ సింగ్ గోహిల్ అనే 20 ఏళ్ల యువకుడు.. తన స్నేహితుడితో కలిసి కలియాబీడ్ ప్రాంతంలోని రద్దీగా ఉండే రోడ్డుపై కారు రేస్ (Car Race) స్టార్ట్ చేశాడు. హర్ష్‌రాజ్ సింగ్ క్రెటా కారులో వెళ్తుండగా.. అతడి స్నేహితుడు ఎరుపు రంగు బ్రెజ్జా కారులో రేస్‌కు సిద్ధమయ్యారు. అయితే ఈ క్రమంలో హర్ష్‌రాజ్ సింగ్.. అత్యంత వేగంగా కారును నడుపుతూ ఇద్దరు పాదచారులను ఢీకొన్నాడు. ఆపై స్కూటర్‌ను కూడా ఢీకొట్టాడు. ఈ ఘటనలో భార్గర్ భట్ (30), చంపాబెన్ వాచాని (65) అనే ఇద్దరు పాదచారులు అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటర్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

car-race.jpg


నిందితుడు హర్షరాజ్‌.. స్థానిక క్రైమ్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI)గా పని చేస్తు్న్న అనిరుద్ధ సింగ్ వజుభా గోహిల్ అని తెలిసింది. ప్రమాద సమయంలో హర్షరాజ్.. గంటకు 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో కారు నడిపినట్లు గుర్తించారు. వేగాన్ని అదుపు చేయలేకపోవడంతోనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న హర్షరాజ్ తండ్రి.. కొడుకును కొట్టాడు. ఆపై అతన్ని నీలాంబాగ్ పోలీస్ స్టేషన్‌‌లో అప్పగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గోదావరిపై మీ కార్యాచరణ ఏంటి?

Read Latest Telangana News and National News

Updated Date - Jul 19 , 2025 | 11:50 AM