Bhopal Canal Car Crash: ఆవును కాపాడబోయి యాక్సిడెంట్.. ఎయిర్ హోస్టెస్ మృతి..
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:00 PM
Bhopal Air Hostess Car Crash Tragedy: భోపాల్‌లో హృదయ విదారకమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కాలువలో పడిపోవడంతో 21 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ మృతి చెందింది. స్పీడుగా వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా కారు అడ్డురావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Bhopal Air Hostess Harshita Sharma Death: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో షికారుకు వెళ్లిన 21 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ అనుకోని ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంది. కారు కాలువలో పడిపోవడంతో తలకు తీవ్రగాయాలై మరణించింది. ఆమె స్నేహితుడు జై అతి వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
జైపై ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు
గురువారం రాత్రి కోలార్ సిక్స్ లేన్‌లోని హోలీ క్రాస్ స్కూల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఎయిర్ హోస్టెస్ హర్షిత ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఒక ఆవు అడ్డొచ్చింది. ఆ సమయంలో ఆమె స్నేహితుడు జై కారు డ్రైవ్ చేస్తున్నాడు. అప్పటికే కారు స్పీడ్ గా వెళ్తుండటంతో కారును నడుపుతున్న జై ఆవును ఢీకొట్టకుండా ఉండేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో క్షణాల్లోనే హర్షిత, జై, ఆమె మరొక స్నేహితుడు సుజల్ ప్రయాణిస్తున్న కారు సమీపంలోని కాలువలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో జై, సుజల్ గాయాలు లేకుండా తప్పించుకోగలిగారు కానీ హర్షిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేసినా ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆసుపత్రిలో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. బ్రెయిన్ డెడ్ కావడం వల్లే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. శుక్రవారం హర్షిత మృతదేహానికి హమీడియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటన తర్వాత నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు ఆమె స్నేహితుడు జైపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హర్షిత జూలై 2023లో భోపాల్‌లోని ఒక సంస్థ నుంచి ఎయిర్ హోస్టెస్ శిక్షణను పూర్తి చేసి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ద్వారా ఎంపికైంది. ఆమె తరచుగా ఉద్యోగ బాధ్యతల వల్ల మధ్యప్రదేశ్ వెలుపలి ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఉండేది. అలాగే గురువారం బెంగళూరు నుంచి భోపాల్‌కు చేరుకుంది. సోదరుడి పుట్టినరోజు కోసం శుక్రవారం భోపాల్ వస్తానని బుధవారమే తండ్రికి ఫోన్ ద్వారా తెలియజేసింది. కానీ, కుటుంబసభ్యులకు చెప్పకుండా ఒకరోజు ముందుగానే వచ్చి హోటల్‌లో రూం బుక్ చేసుకుని అక్కడే బస చేసింది. తర్వాత జై, సుజల్ కారులో ఆమెను హోటల్ నుంచి తీసుకెళ్లారు. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Maharashtra: పెళ్లికి ముందే టార్చర్.. కాబోయే భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్..
Anurag Kashyap: బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన స్టార్ డైరక్టర్..
JEE topper: పరీక్షకు ముందు యాక్సిడెంట్.. అయినా జేఈఈ టాపర్‌గా..