Bengaluru Auto Drive: భారీగా డబ్బులు ఉన్న బ్యాగ్.. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్...
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:09 PM
బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటోలో దొరికిన డబ్బులు ఉన్న బ్యాగును బాధితుడికి అందించాడు. దీంతో డ్రైవర్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
నేటి కాలంలో ఎవరికైనా డబ్బు కాని, విలువైన వస్తువులు కాని దొరికితే వాటిని దాచుకుంటారు. పోగొట్టుకొన్న వారికి ఇద్దామన్న ఆలోచన అసలు రాదు. చాలా తక్కువ మందికే సొమ్ము దొరికితే తిరిగి ఇచ్చేద్దామనే ఆలోచ చేస్తారు. అయితే ఇలా తిరిగి ఇచ్చే వారిలో ధనవంతులు ఉంటే పెద్దగా ఆశ్చర్యం అక్కర్లేదు. వారి మంచితనంతో ఇచ్చారని భావించ వచ్చు.
రెక్కాడితే కాని డొక్కాడని కొందరు తమకు లక్షల రూపాయాలు దొరికినా.. పోగొట్టుకున్న వారికి అప్పగిస్తుంటారు. అయితే ఇలాంటి వారు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు రాజు(Bengaluru auto driver honesty) అనే ఆటో డ్రైవర్. బ్యాగు నిండా డబ్బులు దొరికినా, దాన్ని పోగొట్టుకున్నవారికి ఇచ్చి తన నిజాయతీని చాటుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకొంది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అసలేం జరిగిందంటే..
బెంగళూరు (Bengaluru)కు చెందిన రాజు అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఒకరోజు ఓ ప్రయాణికుడు డబ్బులు ఉన్న బ్యాగుతో రాజు ఆటో ఎక్కాడు. తన గమ్యస్థానం రాగానే డబ్బులు ఉన్న బ్యాగ్ ను ఆటోలోనే మర్చిపోయి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని రాజు కూడా వెంటనే గుర్తించలేదు. కాసేపటి తర్వాత ఆటో వెనుక సీట్ లో బ్యాగు ఉండటాని డ్రైవర్ రాజు గమనించాడు. ఓపెన్ చేయగా బ్యాగ్ నిండా డబ్బులు కనిపించాయి. అయితే ఆ డబ్బును తీసుకోకుండా దాన్ని పోగొట్టుకున్న ప్రయాణికుడి వద్దకువెళ్లి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. దీంతో డ్రైవర్ రాజు నిజాయితీని ఆ ప్రయాణికుడు ప్రశంసిస్తూ తన డబ్బులు తిరిగి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.
అంతేకాక సదరు వ్యక్తి బహుమతిగా కొంత నగదు ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఆటో డ్రైవర్(auto driver honesty) తిరష్కరించాడు. అయితే ఈ విషయాలు పంచుకుంటూ ఆ ప్రయాణికుడు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో సైతం పోస్టు చేయగా.. అది కాస్త తెగ వైరల్ అవుతుంది. డ్రైవర్ రాజు నిజాయితీని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘మానవత్వం ఇంకా ఎక్కడో బతికే ఉంది’ అని ఓ నెటిజన్లు రాసుకొచ్చాడు. నిజాయితీపరులకు ఎలాంటి ప్రతిఫలం లభించదని మరో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశాడు
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..