Nareddy Sunil Reddy: మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:50 PM
మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల అతడి నివాసంతోపాటు కంపెనీలపై సిట్ అధికారులు దాడులు చేసి.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
అమరావతి, నవంబర్ 27: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. గురువారం ఉదయం విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చిన సునీల్ రెడ్డికి మద్యం కుంభకోణంలోని పలు అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. మద్యం వ్యవహారంలో సునీల్ రెడ్డి నివాసంతోపాటు అతడి కంపెనీలపై సిట్ అధికారులు దాడులు చేసి.. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 27వ తేదీన అంటే.. ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ సునీల్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు నర్రెడ్డి సునీల్ రెడ్డి సన్నిహితుడు.
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సిట్ చేత దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి.. కీలక విషయాలను సిట్ రాబట్టింది. వాటి ఆధారంగా పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో పలువురి కోట్లది రూపాయిల ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తుఫాన్.. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కాస్త ఊరట
Read Latest AP News And Telugu News