MP Mithun Reddy: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కాస్త ఊరట
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:12 PM
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. పార్లమెంటు సమావేశాలకు వెళ్లేందుకు కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది.
విజయవాడ, నవంబర్ 27: రాష్ట్రంలో మద్యం కుంభకోణం కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా పలువురు రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ పి.మిథున్ రెడ్డి(MP Mithun Reddy) కూడా జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. పార్లమెంటు సమావేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై గురువారం ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు(Parliament attendance) అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chevireddy Bhaskar Reddy) వేసిన పిటిషన్ పై కూడా ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చెవిరెడ్డికి జైలులో సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. తన అనారోగ్య కారణాల దృష్ట్యా జైలులో దిండు, పరుపు, ఫ్యాన్ వంటివి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. గురువారం దీనిపై విచారణ జరిపిన ఎసీబీ కోర్టు(ACB Court).. ఆ సౌకర్యాలు కల్పించాలని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు
ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు..