Share News

Bengaluru: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ఢీ కొన్న టెంపో..

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:03 PM

Bengaluru Airport Tempo Accident: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో టెంపో ట్రావెలర్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అసలేం జరిగిందంటే..

Bengaluru: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ఢీ కొన్న టెంపో..
Bengaluru Airport Plane Tempo Accident

Bengaluru Airport Plane Tempo Accident: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని టెంపో ట్రావెలర్‌ను ఢీకొట్టింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బెంగళూరు విమానాశ్రయ ప్రతినిధి మాట్లాడుతూ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీకి చెందిన టెంపో ట్రావెలర్ నియంత్రణ కోల్పోయి విమానాన్ని ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో టెంపో ట్రావెలర్ డ్రైవర్ గాయాలపాలవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇంజిన్ తనిఖీ కోసం విమానాన్ని ఆల్ఫా పార్కింగ్ బే 71 వద్ద నిలిపి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.


డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో టెంపో ట్రావెలర్ ఆగి ఉన్న ఇండిగో విమానం కింద భాగాన్ని ఢీకొట్టింది. సిబ్బందిని దించుతున్నప్పుడు ప్రయాణికుడు నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇంజిన్ నిర్వహణ కోసం విమానాన్ని ఆల్ఫా పార్కింగ్ బే 71 వద్ద నిలిపి ఉంచారు. ఈ ప్రమాదంలో విమానం కింది భాగం, టెంపో ట్రావెలర్ పైభాగం దెబ్బతిన్నాయి. వ్యాన్ గాజు కూడా పగిలిపోయింది. టెంపో డ్రైవర్ ఒక్కడికే గాయలైనట్లు సమాచారం.


Read Also: Bhopal Canal Car Crash: ఆవును కాపాడబోయి యాక్సిడెంట్.. ఎయిర్ హోస్టెస్ మృతి..

Maharashtra: పెళ్లికి ముందే టార్చర్.. కాబోయే భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్..

Anurag Kashyap: బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన స్టార్ డైరక్టర్..

Updated Date - Apr 20 , 2025 | 04:05 PM