Share News

Assembly bypolls 2025: గుజరాత్‌లో బీజేపీ, ఆప్‌కు చెరో సీటు, కేరళలో కాంగ్రెస్ గెలుపు

ABN , Publish Date - Jun 23 , 2025 | 03:09 PM

గుజరాత్‌లో బీజేపీ ఒక స్థానంలోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో గెలుపు సాధించాయి. కేరళలోని నిలాంబర్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌లోనూ ఆప్ పాగా వేసింది.

Assembly bypolls 2025: గుజరాత్‌లో బీజేపీ, ఆప్‌కు చెరో సీటు, కేరళలో కాంగ్రెస్ గెలుపు
BJP, AAP

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. గుజరాత్, పంజాబ్, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాల ప్రకారం, గుజరాత్‌ (Gujarat)లో బీజేపీ (BJP) ఒక స్థానంలోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఒక స్థానంలో గెలుపు సాధించాయి. కేరళలోని నిలాంబర్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌లోనూ ఆప్ పాగా వేసింది. ఆప్ ఆభ్యర్థి సంజీవ్ ఆరోరా 10,637 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు పశ్చిమబెంగాల్‌లోని కలిగంజ్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి 29,000 ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపును ఖాయం చేసుకుంది.


గుజరాత్‌లో బీజేపీ-ఆప్ చెరొకటి

గుజరాత్‌లోని కడీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా 39,452 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఆయనకు మొత్తం 99,742 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి రమేష్‌భాయ్ చావ్డా కేవలం 60,290 ఓట్లతో ఓటమి పోలయ్యారు. ఆప్ అభ్యర్థి జగదీష్ భాయ్ గణపత్‌భాయ్ చావ్డాకు 3,090 ఓట్లు పోలయ్యాయి. కాగా, బీజేపీకి కంచుకోటలా ఉన్న విసావదర్ నియోజకవర్గాన్ని ఆప్ కైవసం చేసుకుంది. ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా 17,554 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. గోపాల్ ఇలియాకు 75,943 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కీరిత్ పాటిల్‌కు 58,388 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నితిన్ రాన్‌పరయకు కేవలం 5,501 ఓట్లు పోలయ్యాయి.


నిలాంబర్‌లో కాంగ్రెస్

కేరళలోని నిలాంబర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదన్ షౌకత్ 11,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అభ్యర్థి ఎం.సర్వాజ్‌పై 11,077 ఓట్ల ఆధిక్యంతో షౌకత్ గెలిచారు. షౌకత్‌కు 77,737 ఓట్లు రాగా, స్వరాజ్ (సీపీఎం)కు 66,660 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పీవీ అన్వర్‌కు 19,760 ఓట్లు, బీజేపీ అభ్యర్థి అడ్వకేట్ మోహన్ జార్జికి 8,648 ఓట్లు వచ్చాయి.


పంజాబ్‌లో ఆప్ గెలుపు

పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా 10,637 ఓట్ల ఆధిక్యంతో గెలుపు సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ ఆషుపై ఆయన విజయం సాధించారు. అటు గుజరాత్‌లోని విసావదర్‌లోనూ ఆప్ అభ్యర్థి గెలవడంతో ఆ పార్టీ సంబరాలు జరుపుకొంటోంది.


ఇరాన్‌లో అణు స్థావరాలపై దాడి.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..

6 రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

For National News And Telugu News

Updated Date - Jun 23 , 2025 | 03:29 PM