Share News

Anurag Kashyap: బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన స్టార్ డైరక్టర్..

ABN , Publish Date - Apr 19 , 2025 | 08:45 PM

Anurag Kashyap Apology to Bramhin: ప్రముఖ నిర్మాత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియా వేదికగా బ్రాహ్మణ వర్గాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై క్షమాపణలు చెప్పారు అనురాగ్. కానీ..

Anurag Kashyap: బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన స్టార్ డైరక్టర్..
Anurag Kashyap Apology to Bramhin

Anurag Kashyap Bramhins Controversy: ప్రముఖ దర్శకనిర్మాత బ్రాహ్మాణులను ఉద్దేశిస్తూ చేసి వ్యాఖ్యలు సంచలనం రేపాయి. "బ్రాహ్మణులపై మూత్రం విసర్జిస్తా... ఏమైనా సమస్యా?" అంటూ చేసిన పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ వర్గాలతో పాటు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దర్శకుడిపై పలు చోట్ల పోలీసు కేసులు నమోదయ్యాయి. కుమార్తెపై అత్యాచార బెదిరింపులు.. కుటుంబాన్ని చంపేస్తామంటూ కొందరు హెచ్చరికలకు కూడా పాల్పడ్డారు. దీంతో ఈ గొడవ సద్దుమణిగేందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్తూ ఓ నోట్ విడుదల చేశారు అనురాగ్.


"ఎవరెన్ని తిట్టినా నేను పెట్టిన పోస్ట్ ను వెనక్కి తీసుకోను. కానీ, అందరిలో ద్వేషం పుట్టిస్తున్న ఆ ఒక్క లైన్ కి మాత్రమే క్షమాపణలు చెప్తున్నా. నా కుమార్తె, కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులకు సంస్కారవంతమైన నాయకుల నుండి అత్యాచారం, మరణ బెదిరింపులు రావడం వల్లే చెప్తున్నా. నా కుటుంబం ఏమీ అనలేదు.బ్రాహ్మణులారా.. మీరు క్షమాపణ కోరుకుంటే, ఆడవాళ్లను విడిచిపెట్టండి. ఈ విలువలు మన గ్రంథాలలో కూడా పొందుపర్చారు. ఒక్క మనువాదంలో తప్ప. మీరు ఎలాంటి బ్రాహ్మణుడో నిర్ణయించుకోండి. ఇదే నా క్షమాపణ" అని ఆయన అన్నారు. విమర్శకులు తనను ఎంత విమర్శించినా బాధలేదని.. కానీ తన కుటుంబాన్నిఈ వివాదంలో ఇరికించవద్దని.. విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు.


19వ శతాబ్దంలో కుల వివక్ష, లింగ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవితంపై రూపొందిన ఫూలే సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ప్రతీక్ గాంధీ, పత్రలేఖ నటించిన 'ఫూలే' సినిమాపై బ్రాహ్మణ సమాజంలో కొంతమంది నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తమను విలన్లుగా చేసి చూపించారంటూ బ్రాహ్మణ సంఘాల నుంచి అనేక విమర్శలు వచ్చాయి. ఈ వివాదం కారణంగా చిత్ర విడుదల ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 25, 2025కి వాయిదా పడింది.


ఇదే గాక, కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే చిత్రనిర్మాతను "నీచమైన చెత్త" అంటూ అభివర్ణించారు. ఒక సోషల్ మీడియా యూజర్ అడిగిన ప్రశ్నకు దర్శకుడు అనురాగ్ కశ్యప్ "నేను బ్రాహ్మణులపై మూత్ర విసర్జన చేస్తాను, ఏదైనా సమస్య ఉందా?" అని బదులివ్వడంతో వివాదం చెలరేగింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.


Read Also: Mallikarjun Kharge: మేము భయపడం.. ఈడీ చార్జిషీటులో సోనియా, రాహుల్ పేర్లపై ఖర్గే

Bengaluru Language Controversy: మర్యాదగా హిందీలో మాట్లాడకపోయావో.. బెంగళూరులో ఉండలేవు.. ఆటో డ్రైవర్‌పై ఓ వ్యక్తి..

Nishikant Dubey: చట్టాలు వాళ్లే చేస్తే పార్లమెంటు మూసేయాలి.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Apr 19 , 2025 | 09:05 PM