Prashant Kishor: దీక్షా శిబిరం వద్ద లగ్జరీ వ్యాన్.. అదిరిపోయే జవాబిచ్చిన పీకే
ABN , Publish Date - Jan 04 , 2025 | 08:52 PM
పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానం వద్ద ప్రశాంత్ కిషోర్ లగ్జరీ వ్యాన్ ఉండటం ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. కోట్ల రూపాయలు విలువచేసే ఈ వ్యానులో ఏసీ, కిచెన్, బెడ్రూం వంటి సకల సదుపాయాలు ఉన్నాయి.

పాట్నా: బీపీఎస్‌సీ నిరసనలకు మద్దతుగా ఆమరణ దీక్ష చేపట్టిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor).. ఆ దీక్షా శిబిరం సమీపంలో ఆయన లగ్జరీ వ్యాన్ పార్క్ చేసి ఉండటం చర్చనీయాంశం కావడంపై తొలిసారి స్పందించారు. తన వాష్‌రూమ్ కోసం ఆ వాహనం ఉందని చెప్పారు.
Alka Lamba: ప్రభుత్వ వ్యతిరేకత ఉంది.. కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం
పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానం వద్ద ప్రశాంత్ కిషోర్ లగ్జరీ వ్యాన్ ఉండటం ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. కోట్ల రూపాయలు విలువచేసే ఈ వ్యానులో ఏసీ, కిచెన్, బెడ్రూం వంటి సకల సదుపాయాలు ఉన్నాయి. వేదిక పక్కనే వాహనం ఉండటంపై విమర్శలు కూడా రావడంతో ప్రశాంత్ కిషోర్ స్పందించారు. విపక్ష పార్టీలు తనను విమర్శించడం కొత్తేమీ కాదని అన్నారు. ''నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాను. నేను వాష్‌రూమ్ కోసం ఇంటికి వెళ్తే ఆహారం తీసుకునేందుకు వెళ్లారా? చిన్నపాటి కునుకు తీసేందుకు వెళ్లారా? అంటూ జర్నలిస్టులు అడుగుతారు. కొందరు వ్యక్తులు నా వ్యానిటీ వాన్ రూ.2 కోట్లు చేస్తుందని, రోజుకు రూ.25 లక్షల అద్దె అని అంటున్నారు. నేను మీడియా ద్వారా చెబుతున్నాను. ఎవరైనా వ్యాను తీసుకు వెళ్లి రోజుకు రూ.25 లక్షలు ఇవ్వండి. వాష్‌రూమ్ కోసం ఒక స్థలం చూపించండి'' అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
ఇదే ప్రశ్న వారిని అడుగుతారా?
సౌకర్యాల గురించి అడుగుతున్న పాత్రికేయులు ఇదే ప్రశ్న ప్రధానమంత్రిని కానీ, సీఎం నితీష్ కుమార్ కానీ అడగ్గలరా అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. కాగా, పరీక్షా పత్రం లీకయిందన్న ఆరోపణలపై డిసెంబర్ 31న జరిగిన కంబైన్డ్ కాంపటీటివ్ ఎగ్జామినేషన్ రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా ప్రశాంత్ కిషోర్ నిరసన దీక్ష సాగిస్తున్నారు. గాంధీ మైదానం వద్ద నిరసన చేపట్టడం చట్టవిరుద్ధమంటూ ప్రశాంత్ కిషోర్, ఆయన మద్దుతుదారులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Grameen Bharat Mahotsav 2025: రూరల్ ఇండియా మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
BJP: ఖర్గే రాజీనామా చేసే వరకు పోరాటం..
Read More National News and Latest Telugu News