Home » Prashant Kishor
బిహార్‌లో శాంతి భద్రతల పరిస్థితి తీవ్రంగా క్షీణించిందని, ప్రభుత్వానికి తాము మద్దతిస్తున్నందుకు విచారిస్తున్నామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై పాశ్వాన్ శనివారంనాడు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో పప్పు యాదవ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు.
రెండో దెబ్బ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీయూపై పడుతుందని, జేడీయూ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లు పెద్ద సంఖ్యలో జన్ సురాజ్ వైపు మళ్లుతున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. జన్ సురాజ్ ఊపు ఇదేవిధంగా కొనసాగితే మూడో దెబ్బ బీజేపీపై పడుతుందని అన్నారు.
మనీష్ కశ్యప్‌కు డిజిటల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన యూట్యూబ్ ఛానెల్‌కు దాదాపు కోటి మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తమిళనాడులో బిహారీ వలసదారుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ కొద్ది సంవత్సరాల క్రితం ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేశారనే కారణంగా కశ్యప్‌ను అరెస్టు చేశారు.
బీహార్‌లోని 60 శాతానికి పైగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ తిరిగి సీఎం అయ్యే ప్రసక్తి లేదని గతవారంలో ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మార్పును కోరుకుంటున్న 60 శాతం ప్రజలు ఎవరికి ఓటు వేయనున్నారనేది రాబోయే రోజుల్లో తేలుతుందని అన్నారు.
ప్రశాంత్ కిషోర్ గతంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా జనతాదళ్ (యూ), బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీలకు పనిచేశారు. తాజాగా ఆయన బీహార్‌లో జరిపిన సర్వే వివరాలను వెల్లడిస్తూ, 62 శాతం ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు తాను, తన టీమ్ చేసిన సర్వేలో తేలిందని చెప్పారు.
ప్రశాంత్ కిషోర్ పార్టీ స్థాపించడానికి ముందు రెండేళ్లపాటు మహాత్మాగాంధీ సత్యాగ్రహం చేపట్టిన చంపరాన్ నుంచి రాష్ట్రంలో సుమారు 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు గత నెలలో ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
అశోక్ చౌదరి తన కుమార్తెకు లోక్‌సభ సీటు సంపాదించేందుకు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు డబ్బులు ఇచ్చారంటూ ప్రశాంత్ కిషోర్ ఆరోపించినట్టు తెలుస్తోంది.
ప్రశాంత్ కిషోర్ గత ఏడాది అక్టోబర్ 2న 'సున్ సురాజ్' పార్టీని ప్రారంభించారు. పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకుండానే పార్టీని ప్రారంభించిన ఆయన... పార్టీలో తాను ఎలాంటి పదవుల్లోనూ ఉండటం లేదని స్పష్టం చేశారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఐపీఎస్ అధికారి మనోజ్ భారతిని నియమించారు.
జన్ సురాజ్ పార్టీతో తన పార్టీని విలీనం చేస్తూ ఆర్‌సీపీ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశాంత్ కిషోర్ స్వాగతించారు. ఒక పెద్ద సోదరుడిగా ఆర్‌సీపీ సింగ్‌కు బిహార్ రాజకీయాలు, ప్రజల జీవనవిధానంపై ఎంతో అవగాహన ఉందని అన్నారు.
సమావేశంలోని ఒక పెద్ద సెక్షన్‌ను విడగొట్టేందుకు తీసుకువచ్చే ఏ చట్టానికైనా తమ పార్టీ వ్యతిరేకమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలని బీజేపీ కోరుకుంటోందని, కానీ దీని వల్ల జేడీ(యూ)కు అతిపెద్ద నష్టం జరుగనుందని జోస్యం చెప్పారు.