Home » Protest
నిరసన ప్రదర్శనలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, బెంగాలీ మాట్లాడే ప్రజలందరినీ బంగ్లాదేశీ రోహింగ్యాలుగా బీజేపీ పిలుస్తోందని, రోహింగ్లాలు బంగ్లాదేశ్‌లో ఉంటారని, ఇక్కడున్న బంగ్లాదేశ్ పౌరులంతా సరైన ఐడీ కార్డులు, గుర్తింపు కలిగి ఉన్నారని చెప్పారు.
Yuvatha Poru: కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం నెల్లూరులో వైసీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. నలభై మందితో ఆందోళన చేపట్టారు. పోలీసులను చూసి యువకులు చెల్లాచెదురయ్యారు.
YCP: యువత పోరు పేరుతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ మూకలు రచ్చ చేశాయి. డీజేలు పెట్టి నృత్యాలు చేశాయి. ఒకానొక దశలో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్ళేందుకు వైసీపీ మూకలు ప్రయత్నించాయి. దీంతో పోలీసులు అడ్డుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ (Los Angeles Protests) నగరం ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది. వలసదారులపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తితో అక్కడి ప్రజలు రోడ్డెక్కి మూడోరోజు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు.
యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకు వచ్చిన వివాదాస్పద 'కొత్త సర్వీసుల చట్టం'పై ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన మంగళవారంనాడు నాలుగో రోజుకు చేరుకుంది.
నిరసనకారులు ఇంఫాల్ వెస్ట్‌లోని లామ్మేల్‌పాట్‌లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయాలకు తాళాలు వేశారు. గవర్న్‌మెంట్ ఆఫ్ ఇండియా అనే పేరున్న సైన్‌బోర్డ్‌కు మసిపూశారు. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌లలో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపారు.
పహల్గాం ఘటనకు నిరసనగా 35 ఏళ్లలో తొలిసారి జమ్మూకశ్మీర్ మూతపడింది. ప్రజలంతా జమ్మూకశ్మీర్ షట్‌డౌన్‌లో పాల్గొనాలంటూ మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లలోనూ ప్రకటిస్తుండగా, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారు.
పోలీసుల అనుమతి లేనప్పటికీ వందలాది మంది నిరసనకారులు సిల్చార్ పట్టణంలోని బెరెంగా ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. రోడ్లు దిగ్బంధం చేయడంతో పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. నల్లజెండాలు ధరించిన నిరసనకారులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారంనాడు జాంగిపూర్ పీడబ్ల్యూబీ మైదానం నుంచి బయలు దేరిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. నేషనల్ హైవేను దిగ్బంధం చేసేందుకు జాంగ్‌పూర్ నుంచి ఉదంపూర్ వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలు హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరి.. హెచ్సీయూ భూముల వద్దకు చేరుకుని అక్కడ బాధిత విద్యార్థులతోపాటుగా హెచ్‌సీయూ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ముఖ్యనేతలు బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.