Hero Vijay: హీరో విజయ్‌కి అన్నాడీఎంకే గాలం.. డిప్యూటీ సీఎం పదవి ఆఫర్..
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:58 PM
డీఎంకే ప్రభుత్వాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్నాడీఎంకే.. విజయ్ విషయంలో ఒక మెట్టు దిగిందా?.. ‘కలిసివుంటేనే కలదు సుఖం’ అన్న నానుడి చందాన ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండేందుకు టీవీకేతో పొత్తుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టిందా?.. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే విజయ్(Vijay)కు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిందా?.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

చెన్నై: డీఎంకే ప్రభుత్వాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్నాడీఎంకే(AIADMK).. విజయ్ విషయంలో ఒక మెట్టు దిగిందా?.. ‘కలిసివుంటేనే కలదు సుఖం’ అన్న నానుడి చందాన ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండేందుకు టీవీకేతో పొత్తుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టిందా?.. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే విజయ్(Vijay)కు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిందా?.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికలకు పది నెలలే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు బలమైన కూటములను ఏర్పాటు చేసుకునే సన్నాహాల్లో తలమునకలైవున్నాయి.
డీఎంకే కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, డీపీఐ, ఎండీఎంకే ముస్లింలీగ్, కొంగు మక్కల్ దేశీయ కట్చి, మనిదనేయమక్కల్ కట్చి ఫార్వర్డ్ బ్లాక్, తమిళగ వాళ్వురిమై కట్చి, మక్కల్ విడుదలై కట్చి, ఆది తమిళర్‌పేరవై, ఎంఎన్‌ఎం పార్టీలున్నాయి. ఆ కూటమిలో చేరేందుకు పీఎంకేలోని ఓ వర్గం ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఖరారు చేసుకున్న అన్నాడీఎంకే రాష్ట్రంలో ఎన్డీయేకు నాయకత్వం వహించబోతోంది.
ఈ నేపథ్యంలో విజయ్ నేతృత్వంలోని టీవీకేను తమ కూటమిలోకి చేర్చుకునేందుకు అన్నాడీఎంకే అధినేత ఈపీఎస్ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. అన్నాడీఎంకేకు, విజయ్‌కు గణనీయంగా ఓటు బ్యాంకు సమకూరే అవకాశముందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే మాత్రం ప్రతిపక్ష ఓట్లు చీలిపోయే అవకాశముందని సూచిస్తున్నాయి. దీంతో ఆ ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు టీవీకేను తమ కూటమిలో చేర్చుకోవడమే మంచిదని అన్నాడీఎంకే, బీజేపీ భావిస్తున్నాయి. నిజానికి ఆదిలోనే అన్నాడీఎంకే-టీవీకే కలిసి సాగినట్లుగా కనిపించింది.
\
ఆ తరువాత విజయ్ పార్టీ నుంచి వచ్చిన గొంతెమ్మ కోర్కెలతో బేజారెత్తిపోయిన అన్నాడీఎంకే దూరంగా జరిగింది. కానీ మళ్లీ అధికారం చేపట్టాలంటే ఆయనతో రాజీ చేసుకోవడమే మంచిదన్న కోణంలో ఈపీఎస్ భావిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ నేతలు కూడా ఇదే ఆలోచనతో ఉండడంతో విజయ్‌ను తమ దరి చేర్చుకునే సన్నాహాలు ముమ్మరమైనట్లు సమాచారం.
ఇందులో భాగంగా తమ కూటమి గెలిస్తే విజయ్‌కి ఉపముఖ్యమంత్రి పదవితో పాటు గణనీయ స్థాయిలో మంత్రి పదవులు కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం. బలహీనవర్గాల ఓటు బ్యాంక్ ఉన్న డీపీఐని కూడా తమకూటమిలోకి లాగేందుకు ఈపీఎస్ బృందం గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే అటునుంచి అంతగా స్పందన వస్తున్నట్లు కనిపించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి.
గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి
Read Latest Telangana News and National News