-
-
Home » Mukhyaamshalu » Tuesday 22th July 2025 Live Updates and Breaking News Top news and Major Events Across India kjr
-

Breaking News: డబుల్ బెడ్‌రూమ్ పేరుతో మోసం.. ఎమ్మెల్యే వివేకానంద్ అనుచరుడిగా గుర్తింపు..
ABN , First Publish Date - Jul 22 , 2025 | 06:06 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 22, 2025 20:41 IST
డబుల్ బెడ్‌రూమ్ పేరుతో మోసం.. ఎమ్మెల్యే వివేకానంద్ అనుచరుడిగా గుర్తింపు..
హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ పేరుతో మోసం.
రెండు పడక గదుల ఇండ్లు ఇప్పిస్తామని భారీ మోసం.
వందలాది మంది వద్ద లక్షలు వసూల్లు.
ఒక్కరి దగ్గర నుండి 35 వేల నుంచి 70 వేల వరకు వసూళ్లు చేసిన బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీధర్ ముదిరాజ్.
జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన భాదితులు.
నిందితుడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అనుచరుడిగా గుర్తింపు.
-
Jul 22, 2025 18:21 IST
ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం..
ఢిల్లీలో ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం.
హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన విమానం AI 315 ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU)లో చెలరేగిన మంటలు.
మంటలతో విమానానికి భారీ నష్టం.
ప్రయాణీకులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రకటించిన ఎయిర్ ఇండియా.
తదుపరి దర్యాప్తు కోసం విమాన సేవలు నిలిపివేత.
-
Jul 22, 2025 17:38 IST
వైసీపీపై సంచలన కామెంట్స్ చేసిన పవన్
నాసిరకం మద్యంతో లివర్ దెబ్బతిని వేలమంది చనిపోయారు: పవన్
జనసేన కార్యాలయానికి అనేకమంది బాధితులు వచ్చారు.
ఒకవైపు నిధులు తినేశారు.. మరోవైపు జనాం ప్రాణాలు తీశారు.
లిక్కర్ స్కాం కేసులో అనేకమంది అరెస్టు అవుతున్నారు.
అయినా ఇంకా బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు.
వైసీపీ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు.
ఇలాంటి తాటాకు చప్పుళ్లు చాలా చూశాం.
ఎన్నో పోరాటాలు చేసి నిలబడ్డాం.. ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చాం.
-
Jul 22, 2025 14:47 IST
రోజా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..
అమరావతి: వైసీపీ మహిళా నేత రోజా వివాదాస్పద వ్యాఖ్యలు.
ప్రజాప్రతినిధులను అవమానిస్తూ మాట్లాడిన మాజీమంత్రి రోజా.
జగన్ మరోసారి అధికారంలోకి వస్తే టీడీపీ నేతలు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు.
గాల్లో గెలిచిన.. గాలి నాకొడుకులు: రోజా
-
Jul 22, 2025 12:36 IST
హైదరాబాద్‌కు రెయిన్ అలర్ట్
హైదరాబాద్‌లో ఇవాళ అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం
హై అలర్ట్ జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు
సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు..
వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీసుల సూచన
-
Jul 22, 2025 12:30 IST
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా ఆమోదం
రాజీనామా ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అనారోగ్య కారణాలతో రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్
-
Jul 22, 2025 11:48 IST
పిటిషన్‌ను ఉపసంహరించుకున్న వైవీ సుబ్బారెడ్డి
తిరుమల కల్తీ నెయ్యి కేసు దర్యాప్తుపై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్న వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
కల్తీ నెయ్యి కేసులో తనను అక్రమంగా ఇరికించాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన వైవీ సుబ్బారెడ్డి
సీజేఐ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ
కల్తీ నెయ్యి కేసుపై నియమించిన సిట్ దర్యాప్తును సుప్రీం కోర్టే పర్యవేక్షించాలని కూడా పిటీషన్‌లో కోరిన వైవీ సుబ్బారెడ్డి
అయితే విచారణ సందర్భంగా ఈ అంశంపై ఇతర న్యాయ మార్గాలను పరిశీలిస్తున్నామని, పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపిన సుబ్బారెడ్డి తరపు న్యాయవాది
అనుమతి ఇచ్చిన చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం
-
Jul 22, 2025 11:41 IST
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా
టెట్ ఫలితాల్లో 33.98 శాతం ఉత్తీర్ణత
టెట్ పరీక్ష రాసిన 90,205 మంది అభ్యర్థులు
ఉత్తీర్ణత సాధించిన 30,649 మంది అభ్యర్థులు
-
Jul 22, 2025 11:40 IST
HCA కేసులో కొనసాగుతున్న విచారణ..
నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ..
జగన్ మోహన్ రావు సహా ఐదుగురుని నిందితులను నేడు కోర్టులో హాజరుపరచనున్న సీఐడీ
6 రోజుల కస్టడీలో నిందితుల నుండి కీలక సమాచారం సేకరించిన సీఐడీ
HCA కార్యాలయంతో పాటు నిందితుల ఇళ్లలో సోదాలు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
మరో 5 రోజులపాటు నిందితులను కస్టడీ కోరనున్న సీఐడీ
నేడు సీఐడీడీకి HCA ఎన్నికలకు సంబంధించి మరిన్ని ఆధారాలు అందించనున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ గురువారెడ్డి..
HCA కేసులో ఈడీ కూడా దర్యాప్తు మొదలుపెట్టింది..
సీఐడీ కేసు ఆధారంగా లోతుగా దర్యాప్తు చేయనున్న ఈడీ..
-
Jul 22, 2025 11:36 IST
మిథున్ రెడ్డి పిటిషన్‌పై ముగిసిన వాదనలు
జైల్లో మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాన్న పిటిషన్పై ముగిసిన వాదనలు
పది రకాల సదుపాయాలు కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన మిథున్ రెడ్డి
తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా? అని జైళ్ల శాఖను అడిగిన కోర్టు
చట్టాలు చేసే వారికి.. ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి కదా అని పేర్కొన్న కోర్టు
రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్‌లో కేటాయించామని తెలిపిన జైలు శాఖ అధికారి
అక్కడ సరైన సదుపాయాలు లేవని తెలిపిన మిథున్ రెడ్డి లాయర్లు
కోర్టు ఆదేశాలు ఇస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన జైలు శాఖ అధికారి
ఇవాళ సాయంత్రం లోపు తీర్పు ఇచ్చే చాన్స్
-
Jul 22, 2025 11:15 IST
లోక్ సభ, రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా
-
Jul 22, 2025 10:45 IST
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పోలీసు బలగాలు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ నేపథ్యంలో
జైలు బయట అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిఘా పెంచిన పోలీసులు
చిత్తూరు జిల్లా నుంచి రాజమండ్రికి చేరుకుంటున్న మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు
మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చే వరకూ..
రాజమండ్రిలోనే ఉండేందుకు కుటుంబ సభ్యులు, అనుచరులు ఏర్పాట్లు
ఇంటి నుంచే మిథున్ రెడ్డికి బోజనం పంపించేందుకు విల్లాలు తీసుకుంటున్న కుటుంబ సభ్యులు
ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా మిథున్ రెడ్డితో ములాఖత్ కానున్నట్టు సమాచారం
-
Jul 22, 2025 10:10 IST
మిథున్‌రెడ్డి పిటిషన్లపై నేడు ACB కోర్టులో విచారణ..
జైలులో TV, ఇంటి భోజనం, 6 ములాఖత్‌లకు అనుమతివ్వాలని వినతి
రాజమండ్రి జైలులో సాధారణ ఖైదీగానే ఉన్న మిథున్‌రెడ్డి
నేడు ఏసీబీ కోర్టుకు హాజరుకానున్న జైలు అధికారులు
సౌకర్యాల కల్పనపై కోర్టుకు నివేదించనున్న జైలు అధికారులు
-
Jul 22, 2025 10:00 IST
నేటితో ముగియనున్న రిమాండ్
నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్
11 మంది నిందితులను నేడు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్న పోలీసులు
గత 2 పర్యాయాలు నిందితులను వర్చువల్ విధానంలో హాజరుపరిచిన పోలీసులు
-
Jul 22, 2025 09:00 IST
రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు
బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణపై చర్చకు పట్టుబట్టనున్న కాంగ్రెస్
రాజ్యసభలో వాయిదా తీర్మానాలు ఇచ్చిన.. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు సయ్యద్ నసీర్ హుస్సేన్, నీరజ్ డాంగి, రంజీత్ రంజన్
రూల్ 267 వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీలు.
-
Jul 22, 2025 08:45 IST
మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు
ఈ నెల 25న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చిన కోవూరు SI రంగనాధ్ గౌడ్
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నపై కేసు నమోదు
ఇటీవల బెయిల్ మంజూరుకి నిరాకరించిన హైకోర్టు.
మహిళా ఎమ్మెల్యేపై అసభ్యకర పదజాలంతో ఆరోపణలు చేయడంపై హైకోర్టు సీరియస్.
-
Jul 22, 2025 08:30 IST
హైదరాబాద్‌లో నకిలీ నోట్ల చెలామణి..
నోట్ల మార్పిడికి యత్నించిన ఇద్దరు యువకులను అరెస్టు చేసిన మెహిదీపట్నం పోలీసులు..
మహారాష్ట్ర ఔరంగాబాద్కు చెందిన అన్సారి అఫ్తాబ్ అజీముద్దీన్
అజీముద్దీన్‌తో స్థానికంగా ఉండే అదిల్ హుసేన్‌కు పరిచయం..
మహారాష్ట్రలో తనకు తెలిసిన ఆకాశ్ దొంగనోట్లను తయారు చేస్తాడని..
రూ.30వేల ఒరిజినల్ నోట్లు ఇస్తే రూ.లక్ష నకిలీ నోట్లు ఇస్తాడని ఆశచూపిన అజీముద్దీన్...
భారీ కమీషన్ వస్తుందని అదిల్ కు ఆశచూపిన అజిమ్..
ఇద్దరూ నకిలీ నోట్లు తీసుకొచ్చి నగరంలో చలామణి చేసేందుకు యత్నం..
నిందితుల నుండి రూ.2 లక్షల విలువ చేసే నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం.