-
-
Home » Mukhyaamshalu » Today Breaking News AP Assembly Session Live Updates Thursday 6th march 2025 Siva
-

Breaking News: తెలంగాణ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
ABN , First Publish Date - Mar 06 , 2025 | 09:28 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-06T20:39:51+05:30
క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
సుదీర్ఘంగా కొనసాగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీ
తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రులు
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం
ఫ్యూచర్ సిటీ బోర్డుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం
నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం
ఉగాది నుంచి 'భూ భారతి' అమలు చేయాలని నిర్ణయం
10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ పోస్టుల మంజూరుకు ఆమోదం
కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం
10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్
-
2025-03-06T20:35:51+05:30
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఎప్పుడంటే..
మార్చి 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
మార్చి 12 నుంచి 27 వరకూ కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ
-
2025-03-06T19:54:36+05:30
ఏ తప్పూ చేయపోయినా జగన్ అరెస్టు చేయించారు: సీఎం చంద్రబాబు..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: సీఎం చంద్రబాబు
ఏపీ అభివృద్ధే నాకు ప్రథమ ప్రాధాన్యత: రిపబ్లిక్ టీవీ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు
భారత్‌లో అంతులేని అవకాశాలున్నాయి: సీఎం చంద్రబాబు
అమరావతిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వంసం చేశారు: చంద్రబాబు
ఒక్క తప్పూ నేను చేయకపోయినా జగన్ అరెస్ట్ చేయించారు: సీఎం చంద్రబాబు
నన్ను అరెస్టు చేసినప్పుడు 60 దేశాల్లో ఉన్న తెలుగువాళ్లు స్వచ్ఛందగా బయటికి వచ్చారు: చంద్రబాబు
ప్రధాని మోదీ నాయకత్వంలో ఇండియా-2047 నాటికి నంబర్ వన్ స్థానానికి చేరుతుంది: చంద్రబాబు
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ధనవంతుల కాలనీల్లో భారతీయులే ఉంటున్నారు: చంద్రబాబు
అమెరికాతో పోలిస్తే.. భారత్ జీడీపీ వృద్ధిరేటు బాగుంది: సీఎం చంద్రబాబు
ఇండియా రోజురోజుకూ అద్భుతంగా వృద్ధి చెందుతోంది: చంద్రబాబు
స్పష్టత, దూరదృష్టితో భారత్ ముందుకు వెళ్తోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో ఇండియా వాళ్లదే కీలకపాత్ర: సీఎం చంద్రబాబు
అప్పుడు ఐటీ గురించి మాట్లాడాను, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను: చంద్రబాబు
రియల్ టైమ్ డేటా అందుబాటులో ఉంది.. డ్రోన్లు, సీసీ కెమెరాలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి: చంద్రబాబు
ఏఐ వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి: చంద్రబాబు
అయితే, ప్రతిదాంట్లోనూ కొన్ని దుష్ప్రభావాలు ఉంటుంటాయి: సీఎం చంద్రబాబు
-
2025-03-06T19:02:55+05:30
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు జగన్ ఆస్తుల వివాదం..
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్‌పై విచారణ
విజయమ్మ, షర్మిల ఇద్దరూ షేర్లు అక్రమంగా బదిలీ చేసుకున్నారని జగన్ పిటిషన్
షేర్ల బదిలీ ప్రక్రియ రద్దు చేయాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను కోరిన జగన్
ఈ కేసులో విజయమ్మ, షర్మిలను ప్రతివాదులగా పేర్కొన్న జగన్ మోహన్ రెడ్డి
అలాగే సండూర్ పవర్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ను ప్రతివాదులగా పేర్కొన్న జగన్
మధ్యంతర పిటిషన్లు వేసిన జగన్, షర్మిల, ప్రతివాదులు..
తదుపరి విచారణ ఏప్రిల్ 3కి వాయిదా వేసిన ఎన్సీఎల్టీ
-
2025-03-06T18:11:10+05:30
రంగన్న మృతిపై పులివెందుల డీఎస్పీ ఏం చెప్పారంటే..
కడప: వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు: డీఎస్పీ మురళీ నాయక్
పులివెందుల ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించాం: డీఎస్పీ మురళీ నాయక్
మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులు సూచించారు: డీఎస్పీ మురళీ నాయక్
ఎస్పీ ఆదేశాల మేరకు కడప రిమ్స్‌లో వైద్యం అందిస్తుండగా.. నిన్న సాయంత్రం మృతిచెందారు: డీఎస్పీ
రంగన్న మృతిపై ఆయన భార్య అనుమానం వ్యక్తం చేశారు: పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్
రంగన్న భార్య ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది: డీఎస్పీ
రంగన్న మృతి సహజమా, అసహజమా? అనేక కోణాల్లో దర్యాప్తు చేపడతాం: డీఎస్పీ మురళీ నాయక్
పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయి: డీఎస్పీ మురళీ నాయక్
రంగన్న మృతిపై సీబీఐ అధికారులకు సమాచారం అందించాం: డీఎస్పీ మురళీ నాయక్
రంగన్నకు గత రెండు సంవత్సరాలుగా పోలీసు భద్రత కల్పించాం: డీఎస్పీ మురళీ నాయక్
వివేకా హత్య కేసులో మృతిచెందిన అందరి మృతిపైనా విచారణ కొనసాగుతోంది: డీఎస్పీ మురళీ నాయక్
-
2025-03-06T18:02:21+05:30
అమరావతి అభివృద్ధిపై కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..
ఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు సమావేశంలో పాల్గొన్న అధికారులు, టీడీపీ ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై ప్రధాన చర్చ
అమరావతి నిర్మాణం, విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై సాగుతున్న చర్చ
అలాగే పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణంపైనా కీలక చర్చ
సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటలకు భారత మండపంలో జరిగే రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌కు హాజరుకానున్న చంద్రబాబు
కాంక్లేవ్ అనంతరం రాత్రికి ఢిల్లీలోనే బస చేసి శుక్రవారం ఉదయం విజయవాడ వెళ్లనున్న చంద్రబాబు
-
2025-03-06T17:40:42+05:30
ఎస్సీ వర్గీకరణ.. తెలంగాణ క్యాబినెట్ ఆమోదం
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం
న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలన్న సీఎం రేవంత్
న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
-
2025-03-06T17:04:28+05:30
మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు..
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్న ముఖ్యమంత్రి
ఇప్పటికే బుధవారం రోజున పలువురు కేంద్రమంత్రులను కలిసిన సీఎం చంద్రబాబు
-
2025-03-06T16:52:56+05:30
వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వండి.. పోలీసులు పిటిషన్..
వల్లభనేని వంశీని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మరోసారి పిటిషన్
విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు
పోలీసుల కస్టడీపై కౌంటర్ దాఖలు చేసిన వంశీ తరఫు న్యాయవాది
కేసు విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా వేసిన ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు
-
2025-03-06T16:47:10+05:30
జానారెడ్డికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవి?..
హైదరాబాద్: జానారెడ్డికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవి?..
జానారెడ్డితో సీఎం రేవంత్ భేటీపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ
ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా జానారెడ్డిని నియమిస్తారని ప్రచారం
ప్రభుత్వం అడిగితే సలహాలు ఇస్తానని బుధవారం కామెంట్ చేసిన జానారెడ్డి
ముఖ్య సలహాదారు పదవి ఆఫర్ చేయడానికే జానారెడ్డి ఇంటికి సీఎ రేవంత్ వెళ్లారని ప్రచారం
-
2025-03-06T16:33:41+05:30
జగన్ మోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన జన సైనికులు..
ఏలూరు: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్ జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు ఫిర్యాదు
వైఎస్ జగన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్న జనసేన కార్యకర్తలు
అనంతరం ద్వారకాతిరుమల ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన పార్టీ శ్రేణులు
అరడజనుకు ఎక్కువ.. డజనుకు తక్కువ, ఈడీకి ఎక్కువ సీబీఐకి తక్కువంటూ నినాదాలు
ఎంపీడీవో కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకూ ప్లకార్డులతో ర్యాలీ
మాజీ సీఎం జగన్ రెడ్డి ఇప్పటికైన పద్ధతి మార్చుకోవాలంటూ జనసేన శ్రేణులు హెచ్చరిక
డిప్యూటీ సీఎం పవన్‌ను విమర్శించే స్థాయి జగన్‌కు లేదంటూ ఎద్దేవా
పవన్ కల్యాణ్ నిన్ను ఏ స్థాయిలో కూర్చోబెట్టారో మర్చిపోయావా? అంటూ నినాదాలు
తండ్రి, బాబాయి చావును అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యావంటూ విమర్శలు
తమ అభిమాన నేత పవన్ కల్యాణ్‌ను మరోసారి విమర్శిస్తే సహించబోమంటూ హెచ్చరిక
-
2025-03-06T16:01:47+05:30
హకీంపేట భూములు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్..
వికారాబాద్: హకీంపేట భూసేకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్
భూసేకరణ నిలుపుదల చేస్తూ స్టే విధించిన తెలంగాణ హైకోర్టు
హకీంపేట భూముల సేకరణ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
పిటిషన్ దాఖలు చేసిన హకీంపేటకు చెందిన కుమ్మరి శివకుమార్
గతేడాది నవంబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
హకీంపేట గ్రామంలో 351 ఎకరాల సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల
2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదని పిటిషనర్ వాదన
నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని హైకోర్టును కోరిన పిటిషనర్ శివకుమార్
అప్పటివరకూ నోటిఫికేషన్‌పై స్టే విధించాలని పిటిషన్‌లో కోరిన శివకుమార్
పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ జె.శ్రీనివాస్ రావు ధర్మాసనం
స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ
అలాగే ఆర్డీవో, తహసీల్దార్, టీఎస్‌ఐఐసీ ఎండీకూ నోటీసులు జారీ చేసిన హైకోర్టు
తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
-
2025-03-06T13:20:30+05:30
కోర్టులో వాడి వేడి వాదనలు.. వంశీకి బెయిల్ వస్తుందా..
విజయవాడ: వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ.
వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాక్యూషన్.
కస్టడీ లో విచారించిన సమయంలో కీలకమైన సమాచారం తెలిసిందన్న పిపి.
వంశీతో పాటు, మరో ఇద్దరిని కస్టడీలో విచారణ చేసే సమయంలో వారు కూడా.
వంశీ ఆదేశాలతోనే సత్యవర్ధన్‌ను కలిసినట్లు అంగీకరించారని కోర్టుకు తెలిపిన పిపి.
ఈ పరిస్థితుల నేపధ్యంలో బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరిన పిపి.
మరింత సమాచారం కోసం వంశీని పది రోజులు కస్టడీ ఇవ్వాలని పిటీషన్‌ను వేసిన విషయం వివరించిన పిపి.
సత్యవర్ధన్ కిడ్నాప్‌నకు, వంశీకి ఎటువంటి సంబంధం లేదన్న వంశీ తరపు న్యాయవాదులు.
ప్రభుత్వం కావాలనే వంశీపై తప్పుడు కేసు పెట్టారన్న వంశీ తరపు న్యాయవాది.
వంశీకి అనారోగ్యం కారణాల వల్ల బెయిల్ మంజూరు చేయాలని కోరిన వంశీ తరపు న్యాయవాది.
ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయాధికారి.
కేసు విచారణ ఈనెల పదికి వాయిదా.
-
2025-03-06T12:37:38+05:30
పోసానికి ఏపీ హైకోర్టులో నిరాశ..
పోసాని క్వాష్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు.
తనపై నమోదైన కేసులు కొట్టివేయాలన్న పోసాని పిటిషన్ కొట్టివేత.
చంద్రబాబు, పవన్, వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో నమోదైన 5 కేసులు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్.
ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే.. పీటీ వారెంట్ అమలు అయినందున పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.
-
2025-03-06T12:09:16+05:30
సముద్రంలోకి వృథాగా పోతున్న జలాలు వాడుకుంటే తప్పేంటి: మంత్రి నిమ్మల
రాజకీయ ఉనికి కోసం రాద్ధాంతాలు చేస్తున్నారు.
గోదావరిపై మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణంపై.. నాడు చంద్రబాబు ధర్నా చేసి అరెస్టయిన సంగతి మర్చిపోతే ఎలా.
2024లో ప్రకాశం బ్యారేజీ నుంచి 871 TMCల నీరు సముద్రంలోకి పోయింది.
సముద్రంలోకి పోయే నీరు వెనుకబడిన కరవు జిల్లాలు.. రాయలసీమ, ప్రకాశం జిల్లాలు వాడుకుంటే అభ్యంతరం సరికాదు.
ఏటా గోదావరి నుంచి 3వేల టీఎంసీల వరద నీరు సముద్రంలోకి పోతోంది.
దానిలో 200 టీఎంసీల నీరు దుర్భిక్ష ప్రాంతాలకు తరలిస్తే.. ఏ పార్టీ అయినా.. ఏ ప్రాంతం అయినా స్వాగతించాలి.
తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సానుకూలంగా ఆలోచించాలి.
శ్రీశైలం ప్రాజెక్ట్‌కు 2024 అక్టోబర్ 25 వరకు ఇన్‌ఫ్లో వస్తూనే ఉంది.
గత రెండేళ్లు కృష్ణాలో నీరు లేక కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ కుడి కాలువ కింద క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వచ్చింది.
అత్యంత అవసరమైన నీరు సముద్రంలోకి పోవడమా.. అవసరమైన ప్రాంతాలకు తరలించడమా అనేది ఆలోచించాలి.
-
2025-03-06T12:05:03+05:30
డీప్యూటీ సీఎంకు స్వల్ప ఊరట..
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు స్వల్ప ఊరట
ఉదయనిధిపై కొత్త కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశం
సనాతన ధర్మంపై గతంలో ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా నమోదైన పలు కేసులను ఎదుర్కొంటున్న ఉదయనిధి
-
2025-03-06T11:22:25+05:30
ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్ వర్మకు స్వల్ప ఊరట
ఆర్జీవీపై నమోదైన కేసు విచారణపై 6 వారాల పాటు స్టే
సీఐడీ కేసును కొట్టివేయాలని హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్
6 వారాల పాటు తదుపరి చర్యలు నిలుపుదల చేసిన హైకోర్టు
-
2025-03-06T09:51:49+05:30
దువ్వాడ శ్రీనివాస్‌కు షాక్..
అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్. ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత అడపా మాణిక్యాలరావు.. దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
-
2025-03-06T09:49:10+05:30
సీఎం చంద్రబాబును అభినందించిన పీఎం మోదీ..
అమరావతి: ఎమ్మెల్సీల విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంగ్లీషులో పెట్టిన పోస్టుకు తెలుగులో అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు.
కేంద్రంలోను, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డీఎ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి.
రాష్ట్రం అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి.
అంటూ ప్రధాని పోస్ట్ చేశారు.
ప్రధాని పోస్టుకు సీఎం చంద్రబాబు స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రంలోని ఎన్డీఏ పక్షాల తరఫున ధన్యవాదాలు.
మోదీ నేతృత్వంలో ఎన్డీయే అటు దేశంలో ఇటు రాష్ట్రంలో మరెన్నో విజయాలను సాధిస్తుందని నమ్ముతున్నాను.
ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాను.
-
2025-03-06T09:34:28+05:30
ఏలూరులో ఘోర ప్రమాదం..
ఏలూరు: ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద హైవేపై లారీ-ప్రవేటు ట్రావెల్స్ ఢీ.
ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు.
క్షతగాత్రులు ఏలూరు ఆసుపత్రికి తరలింపు.
బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతుండగా ప్రమాదం.
బస్సు ప్రమాదంపై మంత్రి పార్థసారధి దిగ్భ్రాంతి.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన మంత్రి పార్థసారథి.
ప్రమాద సంఘటనపై వివరాలను జిల్లా యంత్రాంగాన్ని అడిగి తెలుసుకున్న మంత్రి.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఫోన్ ద్వారా ఆసుపత్రి అధికారులకు ఆదేశం.
-
2025-03-06T09:31:47+05:30
కడప : వివేకానంద రెడ్డి ఇంటి వాచ్‌మెన్ మృతి.. నేడు పోస్టుమార్టం.
వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్ రంగన్న మృతదేహానికి నేడు రిమ్స్‌లో ఫోస్టుమార్టం చేయనున్నారు.
వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న అనారోగ్యంతో బుధవారం నాడు కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి.
రంగన్న అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ సీబీఐ, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగన్న మృతదేహానికి
పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
గతంలో సాక్షుల మృతి అనుమానస్పదం కావడంతో రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు.
-
2025-03-06T09:28:20+05:30
ప్రారంభమైన అసెంబ్లీ..
అమరావతి: నేడు 6వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.
ఉదయం 9 గంటలకు శాసన సభ...10 గంటలకు శాసన మండలి ప్రారంభం.
ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం.
శాసన సభలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, ప్రైవేట్ గోదాముల్లో పీడీఎస్ బియ్యం, అనకాపల్లిలో తీర ఆధారిత ఉక్కు కర్మాగారం, రైతుల ఆత్మ హత్యలు, గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మాణం, ఫించన్ లబ్ధిదారులు, తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు.
శాసన మండలిలో రాష్ర్టంలో మాదక ద్రవ్యాలు, ఉద్యోగులకు కొత్త పీఅర్‌సీ, ఐఆర్, పోలవరం డయాఫ్రం వాల్, విశ్వ విద్యాలయాల పునరుజ్జీవం, కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలు, ఆంగన్ వాడిలా వేతనాలు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు.
శాసన మండలిలో 2025-2026 బడ్జెట్‌పై చర్చ.
2025-26 బడ్జెట్ గ్రాంట్‌లను ఉభయ సభల ముందు ఉంచనున్న ఆయా శాఖల మంత్రులు.