Share News

BREAKING: గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ రద్దు చేసిన హైకోర్టు

ABN , First Publish Date - Nov 18 , 2025 | 07:03 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ రద్దు చేసిన హైకోర్టు

Live News & Update

  • Nov 18, 2025 22:08 IST

    తెలంగాణ: గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ రద్దు చేసిన హైకోర్టు

    • పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష రద్దు

    • 2015-16 గ్రూప్‌-2 పరీక్షను రద్దు చేసిన హైకోర్టు

    • హైకోర్టు ఆదేశాలను TGPSC ఉల్లంఘించిందన్న జడ్జి

    • TGPSC పరిధి దాటి వ్యవహరించిందన్న హైకోర్టు

    • పునర్‌ మూల్యాంకనం చేయాలని TGPSCకి హైకోర్టు ఆదేశం

    • మూల్యకనం తరువాత అర్హుల జాబితా ప్రకటించాలని ఆదేశం

    • ఎనిమిది వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్న హైకోర్టు

  • Nov 18, 2025 21:00 IST

    అమరావతి: రేపు సత్యసాయి, కడప జిల్లాలకు సీఎం చంద్రబాబు

    • శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరుకానున్న సీఎం

    • కడప జిల్లాలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల

    • అన్నదాత సుఖీభవ రెండో విడతలో 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్ల జమ

  • Nov 18, 2025 20:59 IST

    మాజీ సైనిక ఉద్యోగి భూమిపై హైకోర్టు తీర్పు..

    • అమరావతి: మాజీ సైనిక ఉద్యోగి చెంచయ్యకి సర్వీసులో కేటాయించిన భూ వివాదంపై హైకోర్టులో తీర్పు

    • సర్వీసులో ఉన్న సైనిక ఉద్యోగులకు భూ కేటాయింపు తప్పేమి కాదు: ఏపీ హైకోర్టు

    • ఆ భూమిని వెనక్కి తీసుకునేందుకు వీలులేదు: హైకోర్టు

    • నిబంధనలు అడ్డుపెట్టుకుని మంచి ఉద్దేశాన్ని దెబ్బతీయడానికి వీలులేదు: హైకోర్టు

    • అడవి పోరంబోకుగా కలెక్టర్ ఎలా నిర్దారించారో అర్దంకావడం లేదన్న హైకోర్టు

    • 22ఏ నుంచి ఆ భూమిని కలెక్టర్‌ తొలగించడాన్ని తప్పుపట్టిన హైకోర్టు

    • 3 నెలల్లో భూములను నిషేదిత జాబితా నుంచి తొలగించాలి: హైకోర్టు

  • Nov 18, 2025 20:59 IST

    పైరసీ చేసే వాళ్లను ఎన్‌కౌంటర్ చేయాలి: నిర్మాత సి.కల్యాణ్‌

    • వందలమంది కష్టం సినిమా, పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వంతో కలిసివెళ్తాం: నిర్మాత సి.కల్యాణ్‌

    • టికెట్‌ రేట్ల పెంపుపై చాంబర్‌ సభ్యులతో చర్చిస్తాం: నిర్మాత సి.కల్యాణ్‌

  • Nov 18, 2025 16:05 IST

    ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ కంపెనీలపై ఈడీ దాడులు

    • దేశవ్యాప్తంగా ఏకకాలంలో 11 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు

    • బెంగళూరు 5, ఢిల్లీ 4, గురుగ్రామ్‌లో 2 చోట్ల సోదాలు

    • గేమింగ్ యాప్ నిర్వాహకుల ఇళ్లలోనూ ఈడీ తనిఖీలు

    • క్రిప్టో కరెన్సీ ద్వారా సంస్థ ప్రమోటర్లు మనీలాండరింగ్ చేసినట్టు గుర్తింపు

  • Nov 18, 2025 16:04 IST

    విజయవాడ: భవన యజమాని కోసం పోలీసుల ఆరా

    • యజమాని నెలన్నర నుంచి విదేశాల్లో ఉంటున్నట్లు సమాచారం

    • 10 రోజుల కింద మావోయిస్టులు వచ్చినట్టు పోలీసుల అనుమానం

    • కూలీ పనుల కోసం వచ్చామని వాచ్‌మెన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి..

    • భవనంలోకి ప్రవేశించిన మావోయిస్టులు

    • వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు

  • Nov 18, 2025 16:04 IST

    రూ. 25 కోట్ల ఆర్ధిక సాయం

    • కాణిపాకం దేవస్థానానికి టీటీడీ రూ. 25 కోట్ల ఆర్ధిక సాయం

    • టీటీడీ ప్రతిపాదనను ఆమోదించిన ఏపీ ప్రభుత్వం

    • యాత్రికుల కోసం భవన సముదాయం నిర్మాణానికి ఆర్థికసాయం

  • Nov 18, 2025 16:03 IST

    ఏలూరులో 11 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు

    ఏలూరు గ్రీన్‌సిటీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

    గ్రీన్‌సిటీలోని ఓ ఇంట్లో వారం రోజులుగా ఉన్న మావోయిస్టులు

  • Nov 18, 2025 13:51 IST

    ముగిసిన ఆక్టోపస్ బలగాల సోదాలు

    • విజయవాడ: న్యూ ఆటో నగర్‌లో ముగిసిన ఆక్టోపస్ బలగాల సోదాలు..

    • 27 మంది మావోయిస్ట్ సానుభూతిపరులని అదుపులోకి తీసుకున్న అధికారులు..

    • ఆపరేషన్ ఖగర్ నేపధ్యంలో అరణ్యాల ని వదిలి.. పట్టణాలలో తల దాచుకుంటున్న మావోలు..

    • పక్కా సమాచారంతో వారు ఉంటున్న భవనాన్ని రౌండప్ చేసి మావోలను అదుపులోకి తీసుకున్న అధికారులు..

    • ఐదు గంటలకు పైగా సాగిన ఆపరేషన్.

  • Nov 18, 2025 13:49 IST

    ఉగ్రవాద సంస్థ పేరుతో వాట్సాప్ ఛానల్

    • ఢిల్లీ: ఉగ్రవాద సంస్థ జై షే మహమ్మద్ పేరుతో వాట్సాప్ ఛానల్

    • వాట్సాప్ ఛానల్‌కు 13000 మంది ఫాలోవర్లు..

    • ఉగ్రవాద భావజాలాన్ని వాట్సాప్ ద్వారా వ్యాపింపజేస్తున్న జై షే మహమ్మద్..

    • వాట్సాప్ ఛానల్‌ను క్లోజ్ చేసిన దర్యాప్తు అధికారులు.

  • Nov 18, 2025 13:10 IST

    ట్రైన్ ఢీకొని బిటెక్ విద్యార్థిని మృతి

    • నెల్లూరు : కావలి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ఢీకొని బీటెక్ విద్యార్థిని మృతి

    • కావలి విట్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని

    • కొండాపురం మండలం సాయిపేటకు చెందిన విద్యార్థిగా గుర్తింపు..

    • సెల్ ఫోన్ మాట్లాడుతూ ట్రైన్‌కు తగిలి పడిపోయినట్లు సమాచారం..

    • సంఘటనా స్థలంలో విద్యా్ర్థి ఐడీ కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ లభ్యం..

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు.

  • Nov 18, 2025 13:08 IST

    ఎన్‌కౌంటర్ వివరాలు వెల్లడించిన ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ

    • ఎన్‌కౌంటర్ వివరాలు వెల్లడించిన ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్రా లడ్డా

    • ఈరోజు తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది..

    • ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు..

    • మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు ఆయన సతీమణి మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు..

    • మరో ఐదుగురు మావోయిస్టులు ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్నారు..

    • ఇటీవల మావోయిస్టులకు సహకరిస్తున్న 31 మందిని అదుపులోకి తీసుకున్నాం..

    • మరో 26 మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది ..

    • మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహిస్తాం..

    • మృతి చెందిన మావోయిస్టులు చత్తీష్ ఘడ్ కు చెందిన వారు..

    • మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం పంపిస్తున్నాం.

  • Nov 18, 2025 12:05 IST

    టిప్పర్లు ఢీ.. క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్

    • విశాఖ: రాంబిల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

    • రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన టిప్పర్‌ను ఢీకొట్టిన మరో టిప్పర్..

    • టిప్పర్ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ సాయికుమార్..

    • క్యాబిన్‌ నుంచి బయటకు తీసేందుకు ఆరు గంటలుగా శ్రమిస్తున్నా ఫలితం శూన్యం..

    • ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఫైర్ సిబ్బంది.. కాపాడండి అంటూ.. డ్రైవర్ సాయి కుమార్ అర్ధనాదాలు..

    • సాయికుమార్‌‌ను బయటకు తీసేందుకు కష్టపడుతున్న ఆయన బంధువులు..

    • ఉదయం ఐదు గంటలకు రాంపురం జంక్షన్ వద్ద జరిగిన ఘటన..

  • Nov 18, 2025 11:13 IST

    ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ..

    • కేసు విచారణను డిసెంబర్ 9 వాయిదా వేసిన ధర్మాసనం..

    • ప్రభాకర్ రావు తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కేసు విచారణ వాయిదా..

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం..

    • విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం.

  • Nov 18, 2025 10:25 IST

    బ్రిలియంట్ కాలేజీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

    • బ్రిలియంట్ కాలేజీ చోరీ కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు

    • బ్రిలియంట్ కాలేజీలో 1.50 కోట్ల చోరీ కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు

    • అంతర్ రాష్ట్ర ముఠా కు చెందిన పలువురు అరెస్ట్ ..

    • సెప్టెంబర్‌లో పక్కా ప్లాన్‌తో కాలేజీలోకి చొరబడి డొనేషన్‌ల రూపం లో వచ్చిన డబ్బును ఎత్తుకెళ్లిన ముఠా..

    • ఎట్టకేలకు దొరికిన నిందితులు..

    • బ్రిలియంట్ కాలేజీ చోరీకి ముందు మరో రెండు కళాశాలలలోనూ ఈ తరహా చోరీలకు పాల్పడినట్టు గుర్తింపు..

    • 12;30 గంటలకు వివరాలు వెల్లడించనున్న ఎల్బీ నగర్ డీసీపీ.

  • Nov 18, 2025 10:16 IST

    హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు

    • హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో ఐటీ అధికారుల సోదాలు

    • షేక్‌పేట్‌లోని మేహిఫిల్ రెస్టారెంట్లో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు..

    • మేహిఫిల్‌లో సోదాలు చేస్తున్న రెండు ఐటీ బృందాలు..

    • హైదరాబాద్‌లో 15 హోటల్స్ నిర్వహిస్తున్న మేహిఫిల్..

    • ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్న మేహిఫిల్.

    • మేహిఫిల్ రెస్టారెంట్స్ రికార్డులను తనిఖీ చేస్తున్న ఐటీ అధికారులు ..

    • ఆదాయ , వ్యయాలు, ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను పరిశీలిస్తున్న ఐటీ

    • వాస్తవాదాయానికి రికార్డుల్లో చూపించిన ఆదాయానికి మధ్య వ్యత్యాసాలు గుర్తించిన ఐటీ అధికారులు..

    • అనుమానాస్పద లావాదేవీలను సైతం గుర్తించిన ఐటీ అధికారులు.

  • Nov 18, 2025 09:29 IST

    20, 21న తిరుపతిలో రాష్ట్రపతి పర్యటన

    • తిరుపతి: ఈ నెల 20, 21 తేదీల్లో తిరుమల తిరుపతిలో పర్యటించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

    • నవంబర్ 20 న మధ్యాహ్నం 3.25 గం.లకు రేణిగుంట విమానాశ్రయానికి రాక..

    • 3.55 నుంచి 4.30 గంటల వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం..

    • 5.20 గం.లకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహాం, రాత్రికి బస..

    • 21వ తేదీ ఉదయం 9.30 గంటలకు శ్రీ వరాహ స్వామి దర్శనం..

    • 10.00 గం.లకు తిరుమల శ్రీవారి దర్శనం..

    • 10.50 గంటలకు తిరుమల నుండి బయలుదేరి ఉదయం 11.50 గంటలకు తిరుపతి విమాశ్రయం..

    • 12.00 గంటలకు హైదరాబాద్‌కు ప్రయాణం.

  • Nov 18, 2025 09:25 IST

    రేపు కడప జిల్లాలో సీఎం పర్యటన

    • కడప : రేపు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • కమలాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

    • పీఎం కిసాన్ , అన్నదాత సుఖీ భవ పథకాలు ప్రారంభం.. రచ్చ బండ, రైతులతో ముఖా ముఖి కార్యక్రమాలు..

  • Nov 18, 2025 09:24 IST

    మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్..

    • మారేడుమిల్లి అడవుల్లో కొనసాగుతున్న కాల్పులు..

    • మావోయిస్ట్ అగ్ర నేతలు షెల్టర్ తీసుకున్నారని పోలీసులకు సమాచారం..

    • ఎన్ కౌంటర్‌లో అగ్రనేతలు మరణించినట్టు సమాచారం..

    • మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు అందే అవకాశం.

  • Nov 18, 2025 07:44 IST

    నందిగామలో బస్సు ప్రమాదం..

    • ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బస్సు ప్రమాదం..

    • అనాసాగరం ఫ్లైఓవర్‌పై లారీని ఢీకొన్న కావేరి ట్రావెల్స్ బస్సు..

    • 11 మందికి గాయాలు.. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..

    • వారిలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు..

    • హైదరాబాదు నుండి శ్రీకాకుళం వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు..

    • బస్సులో 35 మంది ప్రయాణికులు..

    • లారీని ఓవర్‌టేక్ చేయబోయి లారీని ఢీ కొట్టిన బస్సు.

  • Nov 18, 2025 07:31 IST

    మరోసారి ఐటీ సోదాలు..

    • హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు..

    • ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు..

    • హైద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ బిజినెస్‌పై ఐటీ సోదాలు..

    • 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.

  • Nov 18, 2025 07:30 IST

    ఇద్దరు పిల్లలను గోదావరిలో తోసేసి తండ్రి ఆత్మహత్య..

    • అంబేద్కర్ కోనసీమ జిల్లా: మలికిపురం చించినాడ వంతెన పైనుండి తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకినట్లు సమాచారం

    • ఆత్మహత్య కు పాల్పడిన వారు లక్కవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తింపు..

    • సంఘటన స్థలంలో బైక్, చెప్పులు, సెల్ పోన్, పాన్ కార్డు గుర్తించిన పోలీసులు..

    • పాన్ కార్డు ఆదారంగా సిరిగినీడి దుర్గాప్రసాద్‌గా గుర్తింపు.

  • Nov 18, 2025 07:17 IST

    పేలిన గ్యాస్ సిలిండర్.. ఆరుగురికి తీవ్ర గాయాలు..

    • సిద్ధిపేట జిల్లా: చేర్యాల మండలం ఆకునూర్‌లో పేలిన గ్యాస్ సిలిండర్..

    • గ్యాస్ స్టౌవ్ వెలింగించగా గ్యాస్ లీక్ అయి పెద్ద శబ్దంతో పేలిన సిలిండర్.. ఇంట్లో చెలరేగిన మంటలు..

    • ఇల్లు దగ్ధమవడంతో ఆరుగురికి తీవ్ర గాయాలు..

    • క్షతగాత్రులను చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

  • Nov 18, 2025 07:03 IST

    నేడు టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం..

    • తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం..

    • వైకుంఠ ఏకాదశి దర్శన విధి.. విధానాల అమలుపై నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి..

    • ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ముందుగానే ఆన్‌లైన్‌లో జారీ చేయాలని నిర్ణయం..

    • అధికారుల ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి..

    • తిరుపతిలో గత ఏడాదిగా నిలిచిపోయిన చిన్న పిల్లల ఆస్పత్రితో పాటు స్విమ్స్‌లో ఆగిన పలు నిర్మాణాలకు నిధులు మంజూరు చేయనున్న బోర్డు..

    • పలు కొనుగోళ్లు, ఇంజనీరింగ్ పనులకు ఆమోదం తెలపనున్న బోర్డు.